పన్నుల నుంచి ఆక్సిజన్ ట్యాంకులు, కోవిడ్ మందులను మినహాయించండి, ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ

కోవిడ్ మహమ్మారి దృష్ట్యా, ఆక్సిజన్ ట్యాంకులు, కోవిడ్ మందులను పన్నుల నుంచి మినహాయించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని మోదీని కోరారు.

పన్నుల నుంచి ఆక్సిజన్ ట్యాంకులు, కోవిడ్ మందులను మినహాయించండి, ప్రధాని మోదీకి  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ
Mamata Banerjee
Follow us

| Edited By: Phani CH

Updated on: May 09, 2021 | 3:26 PM

కోవిడ్ మహమ్మారి దృష్ట్యా, ఆక్సిజన్ ట్యాంకులు, కోవిడ్ మందులను పన్నుల నుంచి మినహాయించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాస్తూ..దిగుమతి చేసుకున్న మందులపై కూడా పన్నులు మాఫీ చేయాలన్నారు. బెంగాల్ తో బాటు దేశవ్యాప్తంగా కోవిద్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాను పెంచాలని, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలలోని వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీల వారు రకరకాలుగా సాయం చేస్తున్నారని,ఇలాంటివాటిపై జీఎస్టీ ని, కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని మమత కోరారు. పైగా అనేకమంది డోనర్లు, ఏజెన్సీలు తమ ప్రభుత్వాన్నికూడా కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీటి రేటు స్ట్రక్చర్ కేంద్రం పరిధిలో ఉంటుందని, ఈ కారణంగా అన్ని రకాల సుంకాల నుంచి వీటిని మినహాయించాలని ఆమె సూచించారు.పైగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా డిమాండ్-సప్లయ్ మధ్య విస్తృత గ్యాప్ ఉండబోదని ఆమె అభిప్రాయపడ్డారు.బెంగాల్ ముఖ్యమంత్రిగా గత బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కోవిడ్ పరిస్థితిపై ఆమె ప్రధానికి లేఖ రాయడం ఇది మూడోసారి. ముఖ్యంగా జీఎస్టీ నుంచి వీటిని మినహాయించాలని పలు రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. ఆక్సిజన్ సప్లయ్ పై మమత ఈనెల 7 న ఓ లేఖ రాశారు. తమ రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా 470 మెట్రిక్ టన్నులు మించిపోయిందని, ఏడెనిమిది రోజుల్లో ఇది 550 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని మమతా బెనర్జీ తెలిపారు. కాగా రెండు వారాల క్రితం.. కోవిడ్ మందులు, ఆక్సిజన్ దిగుమతులపై మూడు నెలల పాటు కస్టమ్స్ డ్యూటీని, హెల్త్ సెస్ ని కేంద్రం మాఫీ చేసింది.ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇలా ఉండగా పశ్చిమ బెంగాల్ లో గత 24 గంటల్లో 19 వేల కోవిద్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 12 వేలమంది కోవిద్ రోగులు మరణించారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..

NASA Helicopter: మరో ఘనత సాధించిన నాసా.. తొలిసారి అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..