Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు.. మెట్రో సర్వీసులు కూడా బంద్..

Lockdown in Delhi: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను అరికట్టేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇప్పటికే

Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు.. మెట్రో సర్వీసులు కూడా బంద్..
Lockdown
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2021 | 3:15 PM

Lockdown in Delhi: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను అరికట్టేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ ఆదివారం వెల్లడించారు. అయితే ఈసారి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌తరం చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. దీంతోపాటు రాజధానిలో మెట్రో స‌ర్వీసుల‌ను కూడా ర‌ద్దు చేశారు. ఈ నెల 17 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టంచేశారు.

కొన్ని రోజులుగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేసులు కొద్దిగా త‌గ్గుముఖం పట్టాయని.. ఈ క్రమంలో ఈ చర్యలను మ‌ధ్య‌లో వ‌దిలేయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఏప్రిల్‌లో మ‌ధ్య‌లో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండగా.. ఇప్పుడ‌ు 23 శాతానికి చేరుకుందని తెలిపారు. ఇది కూడా చాలా ఎక్కువని.. కరోనా వ్యాప్తిని మ‌రింత అరిక‌ట్టాల్సిందేన‌ని వైద్యులు పేర్కొంటున్నారని తెలిపారు.

ఢిల్లీలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతోపాటు కొన్ని చోట్ల ఆక్సిజన్ బెడ్స్‌ను పెంచినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్ పరిస్థితి మెరుగైందన్నారు. తమకు ఆక్సిజన్ కావాలంటూ ఫోన్ కాల్స్ రావడం లేదని పేర్కొన్నారు. 18-44 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ జరుగుతోందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. అదనపు వ్యాక్సిన్ డోసులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:

తమిళనాడు కొత్త సీఎం స్టాలిన్ తెలుగువారే..! ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు.. తెలుసుకోండి..

కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ తో బాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, 4 రోజుల సుదీర్ఘ టీవీ కార్యక్రమం

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!