Assam CM: ఉత్కంఠకు తెర.. అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ..
Himanta Biswa Sarma: అస్సాంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్..
Himanta Biswa Sarma: అస్సాంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్.. సీఎం రేసు నుంచి తప్పుకున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా హిమంత బిశ్వశర్మ ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
ఈమేరకు ఆదివారం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి బీజేపీ పరిశీలకులుగా నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేసులో ఉన్న సర్బానంద సోనోవాలే.. హిమంత బిశ్వ శర్మ పేరును ప్రతిపాదించారు. అంతకుముందే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
కాగా రెండు రోజుల నుంచి సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వశర్మ పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకునేందుకు బిశ్వశర్మ వెనకడుగు వేయకపోవడంతో బీజేపీ అధిష్టానం, ప్రధాని మోదీ ఆయనకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని సూచించాయి. కాగా.. హిమంత బిశ్వశర్మ 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.
126 సీట్లు ఉన్న అస్సాంలో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. కూటమి పార్టీ ఏజీపీ 9 సీట్లు గెలవగా.. యూపీపీఎల్ 6 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ 29, ఏఐయూడీఎఫ్ 16, బీపీఎఫ్ 4 సీట్లు గెలుచుకున్నాయి.
Also Read: