Dulquer Salmaan: ఓటీటీలో అడుగుపెట్టనున్న కురుప్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..

మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం 'కురుప్‌'. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ హీరోయిన్‌గా నటించింది.

Dulquer Salmaan: ఓటీటీలో అడుగుపెట్టనున్న కురుప్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2021 | 5:12 PM

మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం ‘కురుప్‌’. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ హీరోయిన్‌గా నటించింది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించింది. 1980-90 మధ్యకాలంలో కేరళ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లను తాగించిన సుకుమార కురప్పు అనే మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జీవిత చరిత్ర ఆధారంగా శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికీ ఇతను పోలీసులకు దొరకకుండా ఓ మిస్టరీగానే మిగిలిపోవడం గమనార్హం. ఇలా ఎన్నో ఆసక్తికరమైన ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈసినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది.

కాగా ఇప్పుడీ క్రైమ్‌ థ్రిల్లర్‌ డిజిటల్‌ మాధ్యమంలోనూ సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లి్క్స్‌లో డిసెంబర్‌ 17 నుంచి ‘కురుప్‌’ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్సే ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా ఈ సినిమాలో కురప్‌, గోపీ కృష్ణన్‌ అనే రెండు పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు దుల్కర్‌. అతని ప్రేయసి శారదాంబ పాత్రలో శోభితా ఆకట్టుకుంది. ఇంకా టొవినో థామస్‌, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుషిన్‌ శ్యామ్‌ నేపథ్య సంగీతం అందించారు.

Also Read:

Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌ వేదికపై స్పెషల్‌ అట్రాక్షన్‌గా హర్నాజ్‌ గౌన్‌.. దీనిని డిజైన్‌ చేసింది ఎవరో తెలుసా?

RAPO19: రామ్ పోతినేని సినిమాలో కీలకపాత్రలో ఆది పినిశెట్టి.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Antarctica: అంటార్కిటికా చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? సరిగ్గా 110 ఏళ్ల క్రితం ఈ విజయం సాధించారు!