AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌ వేదికపై స్పెషల్‌ అట్రాక్షన్‌గా హర్నాజ్‌ గౌన్‌.. దీనిని డిజైన్‌ చేసింది ఎవరో తెలుసా?

సుమారు రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ పోటీల్లో మళ్లీ ఓ భారతీయ ముద్దుగుమ్మ తళుక్కుమంది. తన అందం, అంతకుమించిన సమయస్ఫూర్తితో హర్నాజ్‌ సంధూ విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది.

Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌ వేదికపై స్పెషల్‌ అట్రాక్షన్‌గా హర్నాజ్‌ గౌన్‌.. దీనిని డిజైన్‌ చేసింది ఎవరో తెలుసా?
Basha Shek
|

Updated on: Dec 14, 2021 | 3:54 PM

Share

సుమారు రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ పోటీల్లో మళ్లీ ఓ భారతీయ ముద్దుగుమ్మ తళుక్కుమంది. తన అందం, అంతకుమించిన సమయస్ఫూర్తితో హర్నాజ్‌ సంధూ విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది. అప్పుడెప్పుడో 2000లో లారాదత్తా ఈ టైటిల్‌ దక్కించుకుంటే మళ్లీ ఇప్పుడు హర్నాజే దేశానికి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని ఇండియాకు తెచ్చిపెట్టింది. ఈక్రమంలో ప్రధాన నరేంద్రమోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ ముద్దుగుమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే 80 దేశాల అందాల తారలు పాల్గొన్న ఈ పోటీల్లో హర్నాజ్‌ లాగే ఆమె ధరించిన గౌన్‌ కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సిల్వర్‌ కలర్‌ లైనింగ్‌తో ఎంతో అందంగా కనిపించేలా ఈ గౌన్‌ను డిజైన్‌ చేసింది ఒక ట్రాన్స్‌ వుమెన్‌. ఆమె పేరు సైషా షిండే. ఈ క్రమంలో మిస్‌ యూనివర్స్‌ గా మెరిసిన హర్నాజ్‌తో పాటు సైషా కూడా సంతోషంలో మునిగితేలుతోంది.

అబ్బాయిగా పుట్టినా… ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన 70వ విశ్వసుందరీ పోటీల్లో హర్నాజ్‌ సిల్వర్‌ కలర్‌ గౌన్‌తో మెరిసింది. గౌన్‌పై ఎంబ్రాయిడరీ వర్క్‌, స్టోన్‌ వర్క్‌, సీక్వెన్స్‌లు ఫ్యాషన్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలా సంధూ గౌన్‌ను అందంగా డిజైన్‌ చేసిన సైషా అసలు పేరు స్వప్నిల్‌ షిండే. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచే ఆమె ట్రాన్స్‌వుమెన్‌గా మారింది. అబ్బాయిగా పుట్టినా చిన్నప్పటి నుంచి తనకు అమ్మాయిల డ్రెస్ లు వేసుకోవడం, అందంగా ముస్తాబవడం అంటే ఇష్టం. ఈ సమయంలోనే ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొంది. ప్రతిష్ఠాత్మక నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్న సమయంలో తానేంటో తనకు పూర్తిగా అర్థమైంది. అయితే ఆ సమయంలో తన గురించి బయట ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే మథనపడిపోయింది. అయితే ఎప్పుడో ఒకసారి తన గురించి నిజం తెలియాల్సిందేనని గ్రహించి ఆరేళ్ల క్రితం ఓ రోజున ట్రాన్స్ ఉమెన్ గా మారాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి సర్జరీ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా తన జెండర్‌ను రివీల్‌ చేసింది. తాను ట్రాన్స్‌వుమెన్‌ అని సోషల్‌ మీడియా ద్వారా గర్వంగా ప్రకటించింది. కాగా సైషా వయసు ప్రస్తుతం 40 ఏళ్లు.

వారికి కూడా.. ఇక మిస్‌ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్‌ కౌసం పంజాబీ సంప్రదాయం కనిపించేలా ‘పుల్కారీ ప్యాట‌ర్న్‌’ తో ఎంతో ఆకర్షణీయంగా గౌన్‌ను డిజైన్ చేసింది సైషా. ఆమె గతంలో ప్రియాంకా చోప్రా, క‌రీనా క‌పూర్‌, దీపికా ప‌దుకునే, తాప్సీ, అనుష్కా శ‌ర్మ, క‌త్రినా కైఫ్‌, మాధురి దీక్షిత్ లాంటి బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు కూడా దుస్తుల్ని డిజైన్‌ చేసింది.

Also Read:

పాపం పసివాడు.. అమ్మ పొత్తిళ్లకు దూరమై.. మూడేళ్లుగా శిశుగృహాలో అనాథగా..

పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకు విపక్షాల ర్యాలీ.. కేంద్రంపై రాహుల్‌ తీవ్ర విమర్శలు

Amul Milk: అముల్ మిల్క్ 75 ఏళ్ల విజయప్రస్థానం..ఇది పాల రైతుల విజయ గీతిక..ఉత్పత్తి నుంచి అమ్మకం వరకూ ఇలా..