AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Rice: రెడ్‌రైస్ తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. బానపొట్టని సైతం కరిగించే గుణం దీని సొంతం..

Red Rice Benefits: బియ్యం అనగానే తెల్ల రంగు,  బ్రౌన్ రైస్ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం, నల్ల బియ్యం అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది..

Red Rice: రెడ్‌రైస్ తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. బానపొట్టని సైతం కరిగించే గుణం దీని సొంతం..
Red Rice Benefits
Surya Kala
|

Updated on: Dec 15, 2021 | 11:09 AM

Share

Red Rice Benefits: బియ్యం అనగానే తెల్ల రంగు,  బ్రౌన్ రైస్ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం, నల్ల బియ్యం అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది.

తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యాన్ని అల్లుడికోసం ప్రత్యేకంగా వండిపెడతారు. పీచు, ఇనుము అధికంగా ఉండే ఈ బియ్యంలో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం రెడ్ రైస్. ఈ రైస్ అన్నం నిదానంగా జీర్ణమవుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. విటమిన్‌ బి1, బి2… వంటి విటమిన్లతోబాటు ఐరన్‌, జింక్‌, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్‌… వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు మందులా పనిచేస్తాయివి. ఈ రైస్ ని చైనా సంప్రదాయ వైద్యంలో వీటిని ఎప్పట్నుంచో వాడుతున్నారు. ఆ కారణంతోనే  అయితే ఖరీదు కాస్త ఎక్కువే. అందుకే బ్రౌన్‌ రైస్‌తో కలిపి ప్రయత్నించొచ్చు. అయితే వీటిని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, సిమ్‌లో మెత్తగా ఉడికించి తినాలి.

రెడ్ రైస్ తో ఆరోగ్య ఫలితాలు: 

*ఈ రైస్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. * ఈ బియ్యంలో ఉండే మొనాకొలిన్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. *రెడ్ రైస్‌లో క్యాల్షియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టం చేస్తాయి. దీంతో  ఎముకలు బలాన్ని సంతరించుకుంటాయి. *ఎర్రబియ్యం షుగర్ పేషేంట్స్, గుండె వ్యాధి ఉన్నవారికి ఏంతో మేలు. ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి. *ఈ రైస్ లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోనీయవు. * ఎర్ర అన్నాన్ని రోజూ తినడంవల్ల అందులోని ఐరన్‌, రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచి కణాలకీ కణజాలాలకీ సరిగ్గా అందేలా చేస్తుంది. దీంతో శరీరం అలసట లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. మానసిక ఉత్తేజాన్నీ కలిగిస్తుంది. * ఎర్రబియ్యంలోని మాంగనీస్‌ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేయడంతోబాటు ఫ్రీ- రాడికల్స్‌నూ తగ్గిస్తుంది. * విటమిన్‌-బి6 సెరటోనిన్‌ శాతాన్ని పెంచి ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. * వీటిని క్రమం తప్పకుండా తింటే ఆస్తమా సమస్యను నివారిస్తుంది. * రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్రబియ్యానికి ఉంది. దీంతో ఎర్రబియ్యం రెగ్యులర్ గా తిన్నవారికి బాన పొట్టకూడా తగ్గిపోతుంది. *ఎర్రబియ్యంలోని మెగ్నీషియం, బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హృద్రోగ వ్యాధులను ఈ రెడ్ రైస్ నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:  తెల్లటి మల్లెపువ్వులాంటి ఇడ్లీపై ప్రయోగం.. బ్లాక్ ఇడ్లి తయారీ.. అది ఇడ్లి కాదు డెడ్లి అంటున్న నెటిజన్లు..