AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manohari Gold Tea: ప్రపంచంలోనే ఖరీదైన ‘గోల్డ్ టీ’ పొడి .. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్..

Manohari Gold Tea: మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గోల్డ్ టీని సౌరవ్ టీ ట్రేడర్స్ అత్యధికంగా కిలోకు రూ.99,999 ధరతో కొనుగోలు చేసింది. “టీ వేలంలో ఇది..

Manohari Gold Tea: ప్రపంచంలోనే ఖరీదైన 'గోల్డ్ టీ' పొడి .. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్..
Manohari Tea
Surya Kala
|

Updated on: Dec 15, 2021 | 10:54 AM

Share

Manohari Gold Tea: మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గోల్డ్ టీని సౌరవ్ టీ ట్రేడర్స్ అత్యధికంగా కిలోకు రూ.99,999 ధరతో కొనుగోలు చేసింది. “టీ వేలంలో ఇది ప్రపంచ రికార్డు. మనోహరి గోల్డ్ టీని ఎగువ అస్సాంలోని డిబ్రూగఢ్‌ జిల్లాలో ఉన్న మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. బహిరంగ వేలంలో టీకి చెల్లించిన అత్యధిక ధర ఇదేనని పేర్కొంటున్నారు. ఇంతకుముందు, రోసెల్ టీ ఇండస్ట్రీస్‌కు చెందిన డికోమ్ టీ ఎస్టేట్‌లోని గోల్డెన్ బటర్‌ఫ్లై టీ అని పిలువబడే అరుదైన రకం అస్సాం టీ గౌహతి టీ వేలం కేంద్రం (GATC)లో కిలోకు రూ.75,000 పలికింది.

ఈ టీ ప్రత్యేకమైనది , అరుదైనది.  దీనిని డిబ్రూఘర్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. అస్సాంలోని తేయాకు పరిశ్రమ సమీప భవిష్యత్తులో కూడా ఈ రకమైన ప్రత్యేక టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ, గ్రీన్ టీ, పసుపు టీలను ఉత్పత్తి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. సౌరభ్ టీ ట్రేడర్స్‌కు చెందిన స్థానిక కొనుగోలుదారు మంగీలాల్ మహేశ్వరి టీని కొనుగోలు చేశారు’’ అని దినేష్ బిహానీ తెలిపారు. ఈ టీ పొడిని కాచినపుడు డికాక్షన్‌ ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుందని, సేవిస్తే మనసు తేలికపడిన భావన కలుగుతుందని, పలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని రాజన్‌ లోహియా చెప్పారు. ఈ టీపొడిని సౌరభ్‌ టీ ట్రేడర్స్‌ రికార్డు ధరకు కొనుగోలు చేసిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు, రోసెల్ టీ ఇండస్ట్రీస్‌కు చెందిన డికోమ్ టీ ఎస్టేట్‌లోని గోల్డెన్ బటర్‌ఫ్లై టీ అని పిలువబడే అరుదైన రకం అస్సాం టీ గౌహతి టీ వేలం కేంద్రం (GATC)లో కిలోకు రూ.75,000 పలికింది.

200 సంవత్సరాలుగా పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే ఉంది. అంతేకాదు ఈ అస్సాం టీ ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందింది.  2016-17లో గౌహతి టీ వేలం కేంద్రంలో దాదాపు 17.41 కోట్ల కిలోల టీ అమ్ముడైంది. 2017-18లో 18.44 కోట్ల కిలోలకు, 2018-19లో 18.29 కోట్ల కిలోలకు 2019లో 16.22 కోట్ల కిలోలకు పెరిగింది 20 20. లో గౌహతి టీ వేలం కేంద్రం కింద మొత్తం 1241 తేయాకు తోటలను 244 మంది కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు.

Also Read:   రెడ్‌రైస్ తినడంవలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. బానపొట్టని సైతం కరిగించే గుణం దీని సొంతం..