Punjab Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం.. ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షులతో కీలక భేటీ!
Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుడిగాలి పర్యటన చేయగా, బీజేపీ సైతం ప్రచారంలో దూకుడు పెంచింది.

Punjab Congress District presidents meeting: పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుడిగాలి పర్యటన చేయగా, బీజేపీ సైతం ప్రచారంలో దూకుడు పెంచింది. అధికార పార్టీ కాంగ్రెస్ తమ క్యాడర్‌ను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్తగా నియమితులైన జిల్లాల అధ్యక్షులందరితో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాష్ట్రంలో సమాచారం అందించారు. సిద్ధూ తన ట్వీట్‌లో, ‘రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికలపై చర్చించడానికి కొత్తగా నియమించిన జిల్లాల అధిపతులందరితో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ భవన్ చండీగఢ్‌లో సమావేశాన్ని పిలిచారు. ఈ సమావేశానికి హరీష్ చౌదరి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు.
దీనికి రెండు రోజుల ముందు, సోమవారం, కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. వీరి అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ అయ్యారు. కాగా ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సభ్యుడిగా రెండో స్థానం లభించింది. ఈ మేరకు పార్టీ సంస్థ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేశారని ఆయన చెప్పారు.
పంజాబ్ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో 15 రోజుల్లో సిద్ధమవుతుంది. పంజాబ్ ప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రతాప్ సింగ్ బజ్వా దీని కోసం కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. లూథియానాలో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ భవన్‌లో ‘ఆవాజ్ పంజాబ్ డి’ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ను పార్టీ సోషల్ మీడియా విభాగం సిద్ధం చేసింది. దీనిపై ప్రజలు మేనిఫెస్టోకు సంబంధించి తమ సూచనలు తెలియజేయాలని నిపుణులకు సూచించారు.
Meeting of all newly appointed District Presidents has been convened at Congress Bhawan Chandigarh at 4 PM sharp for discussion on forthcoming 2022 Vidhan Sabha elections! Harish Chaudhary Ji will chair the imp meeting!!!
— Navjot Singh Sidhu (@sherryontopp) December 15, 2021
Read Also… Gadget Guru: వాట్సప్ జాబ్ ఆఫర్ – రిప్లై ఇస్తే ఇక గల్లంతే..! సోషల్ మీడియాలో నేరగాళ్ల హవా..(వీడియో)