కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ.. అతడి బ్యాగ్రౌండ్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో, ధ్రువ, దమ్ము వంటి చిత్రాల్లో నటించింది.
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది అభినయ. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది.
ఓవైపు వరుస సినిమాలతో సక్సెస్ అవుతున్న అభినయ..త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇటీవలే ఆమె తన నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది.
కాబోయే భర్తతో కలిసి గుడి గంట కొడుతున్న ఫోటోను షేర్ చేస్తూ తనకు నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
తాజాగా తన కాబోయే భర్తను అందరికి పరిచయం చేసింది అభినయ. మార్చి 9న తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త ఫోటో షేర్ చేసింది.
అయితే అతడి పేరును కానీ.. అతడికి సంబంధించిన ఓ విషయాన్ని అభినయ పంచుకోలేదు. ఆమె షేర్ చేసిన ఫోటోస్ బట్టి అతడి పేరు కార్తీక్ అని తెలుస్తోంది.
సోషల్ మీడియా పేజీలో అతడి పేరు సన్నీ వర్మ6గా ఉంది. అయితే అభినయకు కాబోయే భర్త ఎక్కడ ఉంటాడు.. ? ఏం చేస్తుంటాడు ? అనే విషయాలు తెలియరాలేదు.
ఇటీవలే మలయాళంలో ఫణి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అభినయ. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.