AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : చేసింది 8 సినిమాలే.. కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టేశారు.. అర్థాంతరంగా సినిమాలకు గుడ్ బై..

తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్.. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. 8 సినిమాలు చేసింది. కానీ అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఉపేసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : చేసింది 8 సినిమాలే.. కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టేశారు.. అర్థాంతరంగా సినిమాలకు గుడ్ బై..
Pooja Bedi
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2025 | 3:05 PM

Share

ఒకప్పుడు ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో కుర్రాళ్లలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ సీనియర్ బ్యూటీ పూజా బేడి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇటీవల సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ “నేను సంప్రదాయవాద ముస్లిం కుటుంబం నుండి వచ్చిన ఫర్హాన్‌ను వివాహం చేసుకున్నాను. అతని కుటుంబం సినిమా సెట్‌లకు వెళ్లే కోడలును అంగీకరించే అవకాశం లేదు. అందుకే సినిమాలకు దూరమయ్యాను. “అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

కానీ ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకులు సైతం చాలా మారిపోయారని తెలిపింది. 1980ల చివరలో, 1990లలో చిత్ర పరిశ్రమ గాసిప్స్ ఎక్కువగా ప్రచారం జరిగేవి అని తెలిపింది. నటీనటుల గురించి నిత్యం ఏదోక వార్త వచ్చేదని తెలిపింది. అప్పట్లో చాలా కుటుంబాలు హీరోయిన్లను కోడళ్లుగా అంగీకరించలేదని అన్నారు. సినిమా ప్రపంచం నుంచి వచ్చిన అమ్మాయిని కోడళుగా అంగీకరించలేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

అలాగే అప్పట్లో ఏ హీరోయిన్ అయినా వివాహం చేసుకుంటే ఆమె కెరీర్ ముగిసినట్లే అని భావించేవారని.. తమ కోడళ్లు గ్లామర్ ప్రపంచానికి చెందినవారు కావడం కష్టమైనదిగా భావించేవారని తెలిపింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలో తన అత్తమామలను అసౌకర్యానికి గురి చేయకుండా.. సంప్రదాయలను విస్మరించకుండా జాగ్రత్త పడ్డానని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?