Geethanjali: నాగార్జున’గీతాంజలి’ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? పరీక్షలు రావడంతో..
తెలుగులో తెరకెక్కిన ఎవర్ గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో గీతాంజలి ఒకటి. మణిరత్నం తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీతోనే నాగార్జునకు కెరీర్ కు మంచి ఊపొచ్చింది. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన గిరిజా షెట్టార్ కు చాలా క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమాలో..

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమాల్లో ‘గీతాంజలి’కి ప్రత్యేక స్థానముంటుంది. 1989లో రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పటికీ చాలా మందికి ఇది ఫేవరెట్ మూవీ అని చెప్పవచ్చు. అలాగే స్టార్ హీరోల ఫేవరెట్ సినిమాల లిస్టులోనూ గీతాంజలి ఉంటుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీలో గిరిజా షెట్టార్ హీరోయిన్ గా నటించింది. క్యాన్సర్ బారిన పడిన ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమలో పడడం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో గీతాంజలి మూవీ తెరకెక్కింది. నాగార్జున, గిరిజలతో పాటు విజయ కుమార్, షావు కారు జానకీ, ముచ్చెర్ల అరుణ్, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, సుమిత్ర, విజయ చందర్,బేబీ నీనా తదితరులు ఈ సినిమాలో వివిధ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీనాకు కూడా నటించే అవకాశం వచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయిందట.
గీతాంజలి సినిమాలో ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉంటారు అందులో చిన్నమ్మాయి పాత్రలో ముందుగా నటించే అవకాశం మీనాకే వచ్చిందట. సినిమాలో కాస్ట్యూమ్స్ కోసం తన కొలతలన్నీ కూడా తీసుకున్నారట. అయితే అదే సమయంలోనే తనకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో అమ్మ నటించడానికి ఒప్పుకోలేదని మీనా ఒక సందర్భంలో వెల్లడించింది. ‘ నాకున్న షూటింగ్ షెడ్యూల్ టైం లోనే ఎగ్జామ్స్ వచ్చాయి. దీంతో గీతాంజలి సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే నాగార్జున గారి సినిమాలో కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించేదాన్ని’ అని మీనా గుర్తు చేసుకుంది.
కూతురితో నటి మీనా..
#Throwback Picture
Actress #Meena and Her Daughter #Theri Baby #Nainika pic.twitter.com/yrR0abVqR1
— Actor Kayal Devaraj (@kayaldevaraj) October 4, 2025
కాగా గీతాంజలి సినిమాను మిస్ అయినప్పటికీ నాగార్జున పక్కన చాలా సినిమాల్లో నటించింది మీనా. టాలీవుడ్ లో ఉన్న సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ జోడీ కూడా ఒకటని చెప్పవచ్చు. కాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.
80’s రీ యూనియన్ లో నటి మీనా..
80’s Reunion ❤️✨#Meena pic.twitter.com/ySdhiSfYXI
— Meena (@ActressMeena_) October 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








