Uday Kiran: ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
ఉదయ్ కిరణ్.. తెలుగు సినిమా ప్రపంచంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన హీరో. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుసగా హ్యాట్రిక్స్ హిట్టుకొట్టిన హీరో. ప్రేమకథ సినిమాలతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిన ఉదయ్.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేశాడు ఉదయ్ కిరణ్. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోగా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషన్ గా మారిపోయాడు. అప్పట్లో ఈహీరోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులకను అలరించారు. నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఎదురైన పరిస్థితులు, మానసిక ఒత్తిడితో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హీరో మరణం అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఇదిలా ఉంటే.. ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమైన సినిమా చిత్రం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సైతం ఇదే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను ఉదయ్ కిరణ్ కంటే ముందు ఓ హీరోతో చేయాలనుకున్నారట. కానీ సినిమా బడ్జెట్ , ఇతర కారణాలతో ఆ హీరో ఈ మూవీ ఆఫర్ వదులుకున్నారట. దీంతో అప్పుడే కొత్త వాళ్ల కోసం చూస్తున్న తేజ దృష్టికి వచ్చాడు ఉదయ్. ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇంతకీ చిత్రం సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. ? ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరో. బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హీరోగానూ వరుసగా హిట్స్ అందుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉండరు. తరుణ్ వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..








