AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani- Akhil Akkineni: అక్కినేని అఖిల్ మిస్ అయ్యాడు.. నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?

సక్సెస్ ఫుల్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు అఖిల్ అక్కినేని చాలా కష్టపడుతున్నాడు. యాక్టింగ్, డ్యాన్సింగ్ , ఫైట్స్.. ఇలా అన్నీ ఆంశాల్లో అఖిల్ ది బెస్ట్ ఇస్తున్నప్పటికీ భారీ హిట్ సినిమా మాత్రం ఈ అక్కినేని అందగాడికి పడడం లేదు.

Nani- Akhil Akkineni: అక్కినేని అఖిల్ మిస్ అయ్యాడు.. నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?
Nani, Akhil Akkineni
Basha Shek
|

Updated on: Oct 14, 2025 | 7:47 PM

Share

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. మనంలో ఓ స్పెషల్ రోల్ లో నటించినప్పటికీ హలో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా నిరాశపర్చినప్పటికీ డ్యాన్స్ లు, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను కూడా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు అఖిల్. కానీ భారీ అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. 2023లో ఈ సినిమా రిలీజ్ కాగా ఇప్పటివరకు అఖిల్ నుంచి మరో మూవీ రాలేదు. ప్రస్తుతం లెనిన్ అనే ఓ సినిమాలో నటిస్తున్నాడీ అక్కినేని అందగాడు. ఈ సినిమాతోనైనా అయ్యగారు హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. కకాగా సినిమా కథల విషయంలో కూడా అక్కినేని అఖిల్ కొన్ని తప్పటడుగులు వేస్తున్నాడని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో తన దాకా వచ్చిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను అఖిల్ అనవసరంగా వదులుకున్నాడట. ఆ సినిమాలను చేసిన ఇతర హీరోలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. స్టార్ హీరోలుగా క్రేజ్ అందుకున్నారు.

అఖిల్ వదులుకున్న సినిమాల్లో ఒకటి నాని హీరోగా వచ్చిన దసరా సినిమా కాగా. ఈ కథ మొదట అఖిల్ దగ్గరికే వచ్చిందట. అయితే వివిధ కారణాలతో అక్కినేని హీరో దసరా సినిమాను వదులుకున్నాడట. కట్ చేస్తే ఈ సినిమాతోనే నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.ఇక అఖిల్ మిస్ చేసుకున్న మరో సినిమా క. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కూడా మొదట అక్కనేని హీరో దగ్గరికే వచ్చిందట. కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. కట్ చేస్తే.. ఈ సినిమా కూడా 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కిరణ్ అబ్బవరం కు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఒక వేళ అఖిల్ ఈ రెండు సినిమాలు చేసి ఉంటే అతని కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండేదేమోనని పిస్తుంది.

ఇక లెనిన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మొదట హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం