AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ తల్లి ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా..! ఈ ప్రోమో చూస్తే మీరూ అదే అంటారు..

కొత్త హౌస్ మేట్స్ హౌస్ లోకి రాగానే రచ్చ మొదలు పెట్టారు’. ఎంట్రీ రోజే నామినేషన్స్ లో హౌస్ మేట్స్ కు వైల్డ్ కార్డు ఎంట్రీలు గట్టి షాక్ ఇచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దువ్వాడ మాధురి, కళ్యాణ్ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది.

అమ్మ తల్లి ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా..! ఈ ప్రోమో చూస్తే మీరూ అదే అంటారు..
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2025 | 12:57 PM

Share

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతుంది. ప్రస్తుతం హౌస్ లోకి కొత్త హౌస్ మేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.. వైల్డ్ కార్డు ఎంట్రీతో ఆరుగురు కొత్త హౌస్ మేట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్. సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్తవారు రావడంతోనే రచ్చ రచ్చ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో దువ్వాడ మాధురికేబీ కళ్యాణ్ కు మధ్య పెద్ద గొడవే జరిగింది. చిన్న విషయానికి దువ్వడం మాధురి పెద్ద రచ్చే చేశారు. కళ్యాణ్ కూడా ఎక్కడా తగ్గకుండా కౌంటర్లు ఇచ్చాడు.

ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్స్ చూపించారు. బజార్ మోగగానే హౌస్ లోకి ఓ బాల్ పంపించారు. ఆ బాల్‌ను క్యాచ్ చేసి తమకు నచ్చిన వారికి ఇవ్వాలి ఆ బాల్ అందుకున్న వారు మిగిలిన వారిలో ఒకరిని నామినేట్ చేయాలి.. అందుకు సారైనా పాయింట్ చెప్పాల్సి ఉంటుంది. కాగా ప్రోమోలో ముందు రాము రాథోడ్, రీతూ చౌదరి మధ్య గొడవ జరగడం చూపించారు. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. అలాగే మాధురి భరణితో వాదన పెట్టుకుంది. దానికి భరణి చాలా ఓపికగా కూల్ గా సమాధానం చెప్పాడు..

ఇక హౌస్ లోకి వచ్చిన బాల్ కోసం హౌస్ మేట్స్ పోటీపడ్డారు. ఫైనల్ గా ఆ బాల్ మాధురి చేతికి చేరింది. ఆ బాల్ ను రీతూకి ఇచ్చింది మాధురి.. దాంతో రీతూ.. భరణిని నామినేట్ చేసింది.. అందుకు పాయింట్ గా మీరు మాట ఇస్తే చేస్తారనే నమ్మకం పోయింది అని అన్నది. దానికి భరణి నేను ఏం మాట ఇచ్చాను.. నేను మాట ఇచ్చిన తరువాత నువ్వెన్ని టాస్క్‌లు ఆడావ్ అని అడిగాడు.. కెప్టెన్ గా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అని రీతూ చెప్పుకొచ్చింది. దానికి కూడా భరణి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. భరణితో పాటు దివ్యనిఖితని నామినేట్ చేస్తూ.. ‘నువ్వు దోసె సరిగా వేయలేదు.. కరెక్ట్ టైమ్‌కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత సంజన కు బాల్రావడంతో ఆమె రాముని నామినేట్ చేసింది..నన్ను లోపల పడుకోనీయలేదు.. నీకు మానవత్వం లేదు అంటూ రాము పై ఫైర్ అయ్యింది. మాచెల్లి మా అక్క ఉన్నా నేను అదే చేస్తాను అని రాము కూడా సమాధానం చెప్పాడు. అలాగే భరణిని కూడా మానవత్వం లేదని సంజన అనడంతో.. ఆయన సీరియస్ అయ్యాడు. మాట్లాడే ముందు ఎదుటి వాళ్లు అన్నది కూడా తీసుకోవాలి అని అన్నాడు భరణి.. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండనుందని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం