AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిత్రమండలి ఈవెంట్‌లో బన్నీవాసు వార్నింగ్.. వెంట్రుక కూడా పీకలేరు అంటూ..

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తున్నారు బన్నీ వాసు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు బన్నీ వాసు. బన్నీ వాసు నిర్మాతగా రూపొందిన లేటెస్ట్ మూవీ మిత్రమండలి.. తాజగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్ చేశారు.

మిత్రమండలి ఈవెంట్‌లో బన్నీవాసు వార్నింగ్.. వెంట్రుక కూడా పీకలేరు అంటూ..
Bunny Vasu
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2025 | 12:20 PM

Share

మిత్ర మండలి ఈవెంట్లో బన్నీవాసు చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఎమోషనల్‌గా ఫైర్‌ అయ్యారు బన్నీవాసు. నన్ను తొక్కాలని చూసేవారు నా తల వెంట్రుకను కూడా పీకలేరు.. తల వెంట్రుకను మాత్రమే చూపిస్తున్నానంటే అది నా సంస్కారం. వేరే వెంట్రుకలను కూడా చూపించగలను అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎప్పుడూ సౌమ్యంగా, లాజికల్‌గా స్టేట్‌మెంట్స్ ఇచ్చే బన్నీ వాసు ఉన్నట్టుండి వెంట్రుకలు పీకలేరు అంటూ పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన్ని అంత ఫైర్‌కి గురి చేసిన విషయం ఏంటని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. అసలు ఏం జరిగిందంటే..

సక్సెస్‌ ఫెయిల్యూర్‌లు జర్నీలో భాగం అంటూ మొదలుపెట్టి తనను తొక్కేయడానికి ట్రై చేస్తున్న వారి మీద ఫయర్‌ అయ్యారు. మిత్రమండలి ట్రైలర్‌ కింద ‘ఎక్కడ నవ్వాలో చెప్పండ్రా’ అనే కామెంట్‌ని ప్రస్తావించారు బన్నీ వాస్. సినిమా చూసిన వారికి నవ్వులు ఆగవు అని చెబుతూనే.. పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో సాగాలని సలహా ఇచ్చారు. దీపావళికి విడుదలవుతున్న నాలుగు సినిమాలూ బావుండాలని అన్నారు. ఒక సినిమాను తొక్కేస్తే ఇంకో సినిమా ఆడుతుందనే భ్రమలు పనికిరావని కౌంటర్‌ ఇచ్చారు.

బన్నీవాసుకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది ఎవరు? అసలు బన్నీ వాసుకు వ్యతిరేకంగా ట్రోలింగ్‌ చేయించింది ఎవరు? విడుదలవుతున్న సినిమాల్లో ఆ అవసరం ఎవరికి ఉంది.? పదే పదే ‘బ్రదర్‌’ అంటూ బన్నీ వాసు ఎవరిని సంబోధించారు? అనే చర్చ షురూ అయింది. పాజిటివ్‌ ఎనర్జీని నెగటివ్‌ ఎనర్జీగా మార్చుకుని పనిచేస్తున్న ట్రోలర్స్.. ఆ సదరు వ్యక్తుల దగ్గర ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేయాలన్న మాటలు కూడా వైరల్‌ అవుతున్నాయి. ఈ దీపావళికి మిత్రమండలితో పాటు తెలుసు కదా, కె – ర్యాంప్‌, డ్యూడ్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా