ఎస్.వీ కృష్ణారెడ్డి చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే
సకుటుంబంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్ లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు.

ఎస్.వీ కృష్ణారెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో మల్టీటాలెంటెడ్ డైరెక్టర్స్‌లో కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు కృష్ణారెడ్డి. ఫ్యామిలీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అలీతో యమలీలలాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఎస్.వీ కృష్ణారెడ్డి. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే కృష్ణ రెడ్డి నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఓ సినిమా సెట్ లో కృష్ణ రెడ్డి చేసిన పనికి ఓ స్టార్ హీరోయిన్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అసలు కృష్ణ రెడ్డి ఏం చేశారు.? ఎందుకు ఆమె ఏడ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.! అసలు ఏం జరిగిందంటే..
ఎస్.వీ కృష్ణారెడ్డి దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వంతో ప్రేక్షకులను అలరించారు. కొబ్బరి బొండాం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కృష్ణారెడ్డి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఎంతో మంది స్టార్స్ తో కలిసి సినిమాలు చేశారు దర్శకుడు కృష్ణారెడ్డి. చివరిగా ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు అనే సినిమా చేశారు.
ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం గ్లామర్ పాత్రలకే హీరోయిన్ అనేలా కాకుండా ఎన్నో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి మెప్పిస్తారు. అలాగే ఆయన హీరోయిన్స్ కు చాలా మర్యాద ఇస్తుంటారు. ఆయన మర్యాద చూసి ఓ సందర్బంలో రమ్యకృష్ణ సెట్లో వెక్కి వెక్కి ఏడ్చేశారట. శ్రీకాంత్ – రమ్యకృష్ణ జంటగా ఆయన తెరకెక్కించిన ‘ఆహ్వానం’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు విపరీతమైన ప్రశంసలు దక్కాయి. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత.. ఎస్వీ కృష్ణారెడ్డి వెండి పళ్లెంలో పట్టుబట్టలు, రూ.10వేల నగదు, బొట్టు పెట్టి, సాంప్రదాయ పద్ధతిలో పంపించారట.. అది చూసిన రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యిందట.. కన్నీళ్లు పెట్టుకుందట.. షూటింగ్ లో ఉన్న వారందరూ ఎమోష్నలయ్యారట.. అది జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎస్.వి. కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








