Nagarjuna : ఎన్నాళ్లకు కుదిరిందయ్యా జోడీ.. నాగార్జున సరసన మరోసారి క్రేజీ హీరోయిన్.. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే..
సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ ఫాంలో ఉన్నారు కింగ్ నాగార్జున. ఇన్నాళ్లు హీరోగా అలరించిన నాగ్.. ఇప్పుడు విలన్ గా అదరగొట్టేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించిన నాగార్జున.. మరోసారి తన నటనతో ఇరగదీశారు. ఇక ఇప్పుడు హీరోగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నాగార్జున 100వ సినిమా గురించి రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతుంది.

అక్కినేని నాగార్జున సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు విలన్ గానూ ఇరగదీశారు. గతేడాది సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో హిట్టు కొట్టారు. ఆ తర్వాత రూటు మార్చి విలన్ పాత్రలో అదరగొట్టేశారు. కూలీ చిత్రంలో నాగ్ స్టైల్, మేనరిజం ప్రేక్షకులను కట్టిపడేశాయి. కుబేర, కూలీ చిత్రాలు వరుసగా హిట్స్ కావడంతో ఇప్పుడు నాగ్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే నాగార్జున కొత్త సినిమాను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగ్ కెరీర్ లో 100వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఈ మైల్డ్ స్టోన్ సినిమాను నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్, నాగ చైతన్య గెస్ట్ రోల్స్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్ టబు నటిస్తుందని టాక్ వినిపించింది. నాగార్జున, టబు అంటే హిట్ జోడీ. చాలా కాలం తర్వాత వీరిద్దరు మళ్లీ నటిస్తున్నారని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. స్వీటీ. ఈ సినిమాలో నాగార్జున సరసన మరో కథానాయికగా అనుష్క శెట్టి కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నాగ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని.. సెకండ్ హీరోయిన్ గా అనుష్క కనిపించనుందని టాక్. దీంతో ఇప్పుడు మరోసారి ఈ మూవీపై హైప్ పెరిగింది. ఇప్పటికే నాగార్జున ప్రాజెక్ట్ కోసం అనుష్కతో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
బాహుబలి సినిమా తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది అనుష్క. చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఒక్కో సినిమా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఘాటీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత నాగార్జున సరనస నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Nagarjuna, Anushka
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..




