AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dude Movie Review : డ్యూడ్ సినిమా రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్టు కొట్టాడా.. ?

లవ్ టుడే, డ్రాగన్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన సినిమా డ్యూడ్. చాలా బోల్డ్ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. గగన్ (ప్రదీప్ రంగనాథన్), కుందన (మమితా బైజు) చిన్నప్పటి నుంచి స్నేహితులు.. బావ మరదళ్లు కూడా. కుందన తండ్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్). ఓ సమయంలో తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు.

Dude Movie Review : డ్యూడ్ సినిమా రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్టు కొట్టాడా.. ?
Dude Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: Oct 17, 2025 | 4:31 PM

Share

మూవీ రివ్యూ: డ్యూడ్

నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి, సత్య, హ్రిదు హరూన్ తదితరులు..

సంగీతం: సాయి అభ్యాంకర్

సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి

ఎడిటర్: భరత్ విక్రమన్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

దర్శకుడు: కీర్తిశ్వరన్

లవ్ టుడే, డ్రాగన్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన సినిమా డ్యూడ్. చాలా బోల్డ్ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

గగన్ (ప్రదీప్ రంగనాథన్), కుందన (మమితా బైజు) చిన్నప్పటి నుంచి స్నేహితులు.. బావ మరదళ్లు కూడా. కుందన తండ్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్). ఓ సమయంలో తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఆమె పై చదువుల కోసం వేరే దగ్గరికి వెళ్లిపోతుంది. అలా వెళ్లిన తర్వాత అక్కడ ఒకర్ని ప్రేమిస్తుంది కుందన. కానీ కొన్ని రోజుల తర్వాత కుందనను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు గగన్. ఆ తర్వాత ఏం జరిగింది..? గగన్, కుందన పెళ్లి చేసుకున్నారా లేదా..? చేసుకుంటే వాళ్ల రిలేషన్ ఏమైంది..? కుందన ఎవర్ని ప్రేమించింది అనేది అసలు కథ..

కథనం:

చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరి మీద మరొకరికి ప్రేమ.. కానీ అది ఒకేసారి కాదు రెండు వేర్వేరు సార్లు రావడం.. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసాం కదా. ఇప్పుడు డ్యూడ్ కూడా ఈ తరహా కథే కాకపోతే ఇందులోనే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పాడు దర్శకుడు కీర్తిశ్వరన్. కానీ డ్యూడ్ చూసాక ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది కదా అది అయితే రాదు. గతంలో కన్యాదానం లాంటి సినిమాలలో ఈ తరహా కథలు వచ్చాయి. అయితే డ్యూడ్ సినిమాలో చెప్పింది మాత్రం అంతకుమించి ఉంది. ఫస్టాఫ్ వరకు నో కంప్లైంట్స్.. సినిమా అదిరిపోయింది.. రాకెట్ స్పీడ్ లో వెళ్లిపోయింది.. సెకండ్ హాఫ్ లోనే అసలు ట్విస్ట్ వచ్చింది. ఆ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథతో డిస్ కనెక్ట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. కానీ మెయిన్ స్టోరీతో ఆఫ్ అయిపోవడం మూలానో ఏమో కానీ సినిమా నాకు అంతగా ఎక్కలేదు.. అలాగని డ్యూడ్ బాగోలేదని కాదు.. కొందరికి నచ్చడం కష్టం.. ఇంకా చెప్పాలంటే డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే. ఇలాంటి కథలకు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.. ఎందుకంటే రియాలిటీ బయట ఇలాగే ఉంది కాబట్టి.. పరువు హత్య కాన్సెప్ట్ జెన్ జీ స్టైల్ లో తీయడం దర్శకుడు కీర్తిశ్వరన్ గొప్ప విషయమే. సెన్సిటివ్ పాయింట్స్ ఇందులో డీల్ చేశాడు.. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది.

నటీనటులు:

ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా నటించాడు.. మనోడిలో ధనుష్, రజినీకాంత్ ఇద్దరు మిక్స్ అయ్యారు. మమిత బైజు చాలా బాగా నటించింది.. మరో కీలక పాత్రలో శరత్ కుమార్ అదరగొట్టాడు. మరో కీలక పాత్రలో మలయాళ నటుడు హ్రిదు హరూన్ బాగున్నాడు. కమెడియన్ సత్య సైతం ఇందులో అలా కనిపించి మాయమయ్యాడు. అలాగే నేహా శెట్టి సైతం చిన్న పాత్ర చేసింది.

టెక్నికల్ టీం:

సాయి అభ్యంకర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధానకర్షణ. పాటలు, మరీ ముఖ్యంగా ‘ఊరుమ్ బ్లడ్’ లాంటి ట్రాక్స్ చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాలలో చక్కగా కుదిరింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో బాగున్నా.. సెకండాఫ్‌లో మాత్రం నిదానంగా అనిపించింది. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ సినిమాతో మంచి డెబ్యూ ఇచ్చాడని చెప్పవచ్చు. అతడు ఎంచుకున్న కథాంశం బాగుంది.. సమాజంలో జరిగేదే చూపించాడు కానీ మరీ బోల్డ్ నెస్ట్ ఎక్కువైపోయింది. అది కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా డ్యూడ్.. ఇట్స్ జస్ట్ ఓకే డ్యూడ్..!