Raghava Lawrence: ఇంత మంచోడివి ఏంటయ్యా.. నడవలేని స్థితిలో చైల్డ్ ఆర్టిస్టు.. అండగా లారెన్స్..
వెండితెరపై తనదైన నటనతో సినీప్రియులను అలరిస్తున్నాడు రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా మారారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా నడవలేని స్థితిలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేశారు.

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్, దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలోని టైటిల్ సాంగ్ లో గ్రూప్ డ్యాన్సర్లలో ఒకడిగా కనిపించిన లారెన్స్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తదైన ముద్ర వేశారు. ముఖ్యంగా లారెన్స్ దర్శకత్వం వహించిన కాంచన్ సిరీస్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న లారెన్స్.. అటు సామాజిక సేవ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి భారీ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎంతో మందికి అండగా నిలిచారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తుంటారు. అలాగే ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తూ చదువు కొనసాగించేందుకు తోడ్పడుతున్నారు. తాజాగా నడవలేని స్థితిలో ఉన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టుకు అండగా నిలబడ్డాడు.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అతడి పేరు రవి రాథోడ్. తెలుగులో అనేక చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ, రవి రాథోడ్ మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. చిన్నప్పుడు రవి రాథోడ్ తల్లిదండ్రులు మరణించడంతో లారెన్స్ దత్తత తీసుకుని.. మంచి స్కూల్లో చదివించాడు. కానీ చదువు అబ్బలేదు. దీంతో లారెన్స్ కు తెలియకుండా స్కూల్ మానేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. ఒక్క రోజు మద్యం తాగకపోతే బతకలేను అనే స్టేజీకి చేరిపోయాడు. దీంతో అతడికి అనారోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీలో రాళ్లు చేరి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇటీవల రవి రాథోడ్ పరిస్థితి తెలుసుకున్న లారెన్స్.. ఒక్కసారి కలవమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎట్టకేలకు చెన్నై వెళ్లి లారెన్స్ ను కలిశాడు రవి రాథోడ్.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
రవి మద్యం అలవాట్లు తెలిసి అతడిపై కోప్పడ్డాడు. లారెన్స్ కోసం ఎప్పటికీ మందు ముట్టనని మాటిచ్చాడు. ఆయన ఇచ్చిన డబ్బుతో తనకంటూ ఒక ఫోన్ కొనుక్కోని ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇటీవల లారెన్స్ తో దిగిన ఫోటోనూ రవి రాథోడ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో రాఘవ లారెన్స్ మంచి మనసుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రవి రాథోడ్ ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి చికిత్స విషయాలను లారెన్స్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




