- Telugu News Photo Gallery Cinema photos Actress Regina Cassandra reveals why she had to change religion
అందుకే నేను క్రిస్టియన్‌గా మారిపోయాను.. అసలు విషయం చెప్పిన రెజీనా
రెజీనా కసాండ్రా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగాపరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజీనా పుటింది ముస్లిం కుటుంబంలో కానీ ఆతర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజీనా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాన్ని వెల్లడించింది.
Updated on: Oct 17, 2025 | 2:06 PM

రెజీనా కసాండ్రా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగాపరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజీనా పుటింది ముస్లిం కుటుంబంలో కానీ ఆతర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజీనా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాన్ని వెల్లడించింది.

నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ముద్దుముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత 2012లో తెలుగులో ‘శివ మనసుల శ్రుతి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా.

ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ‘ఏక్ లత్కీ కో దేకా దో’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళంలో పెద్దగా విజయం సాధించకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఓ ఇంటర్వ్యూలో నటి రెజీనా ముస్లింగా పుట్టిన తర్వాత క్రిస్టియన్‌గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆతర్వాత నేను క్రిస్టియన్‌గా మారిపోయాను అని తెలిపింది.




