- Telugu News Photo Gallery Cinema photos Actress Pragya Jaiswal Shares Stunning Saree Look Photos In Her Instagram
Pragya Jaiswal: అందంలో అప్సరస.. స్టన్నింగ్ లుక్స్‌తో చంపేస్తోన్న ప్రగ్యా.. అయినా పట్టించుకోని టాలీవుడ్..
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది ప్రగ్యా జైస్వాల్. అందంలో అప్సరస్.. ట్రెడిషన్ లుక్స్ లోనూ గ్లామర్ ఫోజులతో యూత్ కు మెంటలెక్కిస్తోంది ఈ వయ్యారి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కానీ ఈ అందానికి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదు.
Updated on: Oct 16, 2025 | 8:21 PM

ప్రగ్యా జైస్వాల్.. తెలుగు సినీప్రియులకు సుపరిచితమే. కంచె సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్టు అందుకోలేదు. ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ జనాలకు దగ్గరయ్యింది. చాలా కాలం తర్వాత బాలకృష్ణ సరసన అఖండ చిత్రంలో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.

అఖండ మూవీ తర్వాత ఈ బ్యూటీకి మళ్లీ నిరాశే ఎదురయ్యింది. తెలుగులో ప్రగ్యా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా బ్యూటీఫుల్ లెహంగాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న టైసన్ నాయుడు చిత్రంలో నటిస్తుంది. అలాగే అఖండ 2లో అతిథిగా కనిపించే అవకాశం ఉందని టాక్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. అలాగే ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన బ్రేక్ సైతం రాలేదు.

తాజాగా ఈ అమ్మడు డిజైనర్ శారీలో వయ్యరాలతో హోయలు పోయింది. రోజ్ గోల్డ్ చీరకట్టులో అందాల షో చేసింది ఈ సొగసరి. ఇప్పుడు ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇంతందాన్ని టాలీవుడ్ పట్టించుకోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో చదువుకుంది. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి కలిగిన ఈ అమ్మడు.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫెమినా మిస్ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్ టైటిల్స్ గెలుచుకుంది.




