మానవత్వం చాటుకున్న సోనూసూద్.. వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి కోసం ఏం చేశాడంటే
సినిమాల కంటే తన మంచి పనులు, సామాజిక సేవా కార్యక్రమాలతోనే అభిమానుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు సోనూసూద్. రీల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ గా కనిపించే ఆయన నిజ జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా క్లిష్ట కాలంలో ఈ నటుడు సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు.

ఇటీవల కురిసిన వర్షల కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో చాలా ఊర్లు నీట మునిగిపోయాయి.చాలా ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అలాగే ఎంతో మంది వరదల్లో చిక్కుకున్నారు కూడా.. ప్రజలకు ఎంతో ఆస్తినష్టం నెలకొంది. ఇక వరదల్లో చిక్కుకున్నవారికి, ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వాలు, అధికారులు ఆదుకుంటున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా వరద బాధితులకు సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వరదబాధితులను ఆదుకున్నారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు.. కలియుగ కర్ణుడు సోనూసూద్ ముందుకు వచ్చాడు.
మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
నటుడు సోనూ సూద్ ఇప్పటికే ఎంతో మందికి సాయం చేశాడు. కష్టం అన్న ప్రతివారికి సోనూసూద్ సహాయం చేశాడు. తాజాగా సోనూ సూద్ పంజాబ్లో వచ్చిన వరద ప్రాంతాల్లో పర్యటించాడు. ఇటీవల కురిసిన వర్షల కారణంగా పంజాబ్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలాగే అమృత్ సర్ లోని వరద ప్రాంతాల్లో పర్యటించిన సోనూసూద్.. అక్కడి బాధితులను పరామర్శించాడు. అక్కడి వారికి సాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ
వరదల కారణంగా చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి, ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి ఇళ్లు నిర్మిస్తాను అని సోనూసూద్ హామీ ఇచ్చారు. వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి సోనూ సూద్ కొత్త ఇళ్లను నిర్మిస్తాను అని హామీ ఇవ్వడం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూసూద్ మంచి మనసును కొనియాడుతున్నారు. ప్రజలు, నెటిజన్స్ సోనూసూద్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. సోనూసూద్ లాంటి వారు ఊరుకి ఒకరు ఉండాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








