మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ కొత్తగా వెండితెరకు పరిచయం అయ్యారు. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు.

కేవలం తెలుగు ముద్దుగుమ్మలే కాదు ఇతర భాషలు హీరోయిన్స్ కూడా చాలా మంది టాలీవుడ్ లో రాణించారు. తమ సొంత భాషలతో కంటే తెలుగులోనే ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే కన్నడ నుంచి వచ్చిన రష్మిక, శ్రీలీల ఇలా చాలా మంది తెలుగులో రాణిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది తెలుగులో దూసుకుపోతున్నారు. ఇప్పటితో పోల్చుకుంటే ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ పరిచయం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా మంది హీరోయిన్ ను అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ భామలను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కూడా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. వారిలో ఒకరే పైన కనిపిస్తున్న అందాల భామ ఒకరు.
ప్రతిరోజు నాకు ఫిజికల్ టచ్ కావాలి.. లేకుంటే నిద్రపట్టదు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. అదే సమయంలో హిందీలోనూ అవకాశాలు అందుకుంది. ఆ అమ్మడు ఎవరో కాదు మోనికా బేడి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించింది ఈ అందాల భామ. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది.
ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
తెలుగులో ఈ అమ్మడు తాజ్ మహల్, శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) స్పీడ్ డాన్సర్ లాంటి సినిమాల్లో నటించింది. అలాగే సురక్షతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్ లో ఉండగానే పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్‌లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత జైలు శిక్ష కూడా అనుభవించింది. 2006లో, ఫేక్ పేరుతో పాస్‌పోర్ట్ తెచ్చుకున్నందుకు ఆమెని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఇలా ఈ అమ్మడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 2లో మోనికా పాల్గొంది. అలాగే పలు టీవీ షోలు కూడా చేసింది మోనికా బేడి. ఇక సొషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








