AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..

దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు హీరోలు, హీరోయిన్లు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ అడుగు పెడుతున్నారు. హోటల్, రెస్టారెంట్, థియేటర్, జ్యూవెలరీ.. ఇలా ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2025 | 1:20 PM

Share

సినిమా ఇండస్ట్రీలోనే ఆమె తోపు హీరోయిన్.. ఆమె అందానికి నటనకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.. 18 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. అందంగా లేదని.. కలర్ తక్కువ ఉందంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. దీంతో ఆమెను చాలా సినిమాల నుంచి తొలగించారు. అయినా ఆమె ఎక్కడా నిరాశ పడలేదు.. ఎక్కడైతే ఆఫర్స్ కోల్పోయిందో అక్కడే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది. కట్ చేస్తే.. రూ.2800 కోట్ల ఆస్తులు ఉన్న ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె భర్త వివాదంలో చిక్కుకోవడంతో ఈ అమ్మడు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఎవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి. 1993లో బాజీగర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆగ్, మెయిన్ ఖిలాడి తు అనారో, ఆవో ప్యార్ కెరన్, మిస్టర్ రోమియో వంటి చిత్లాల్లో నటించింది. హిందీలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ శిల్పాకు అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శిల్పా శెట్టి. విక్టరీ వెంకటేశ్ సరసన సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలకోట్ల ఆస్తి ఉన్న రాజ్ కుంద్రా పై ఇటీవల రూ. 60కోట్లు మోసం చేశారని బిజినెస్ మ్యాన్ దీపక్ కొఠారి కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ వివాదం ప్రస్తుతం నడుస్తుంది. ఇదిలా ఉంటే శిల్పాకు చెందిన బాస్టియన్ రెస్టారెంట్ మూసేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. బాస్టియన్ మాకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఇప్పుడు ఈ రెస్టారెంట్ మూసేస్తున్నట్టు ప్రకటించారు. మరో కొత్త అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాం అని అనౌన్స్ చేశారు. వివాదాల కారణంగా రెస్టారెంట్ మూసేస్తున్నారు అని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తున్నాయి.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.