AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2025 | 2:50 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాని పాన్-ఇండియా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా 120కు పైగా దేశాల్లో విడుదల చేయనున్నారు రాజమౌళి. హాలీవుడ్ నటులు మరియు టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబును ఓ హీరోయిన్ అన్న అన్న అని పిలిచేదట..

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. మహేష్ బాబు సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మహేష్ నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఓ ఈవెంట్‌లో మహేష్ బాబు శ్రీదివ్యను ఎత్తుకున్న ఫోటో పై  శ్రీదివ్య స్పందించింది. చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించా.. ఆ సమయంలో నేను మహేష్ బాబును అన్న అన్న అంటూ ఉండేదాన్ని. నాకు ఆయన చాక్లెట్స్ ఇచ్చేవారు అని శ్రీదివ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

శ్రీవిద్య ఇన్ స్టా గ్రామ్ ..

View this post on Instagram

A post shared by Sri Divya (@sd_sridivya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.