Tollywood: ‘నేనేం పతివ్రతను కాదు.. నేను కూడా తాగుతా’.. తన అలవాట్ల గురించి ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో పార్టీలు, విందులు, వినోదాలు సహజం. చాలా మంది హీరో, హీరోయిన్లు ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు. అయితే ఈ టాలీవుడ్ నటి కమ్ స్టార్ యాంకర్ మాత్రం తాను మందుతాగుతానంటూ ఓపెన్ గా చెప్పేస్తోంది.

జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘కిసిక్క్ టాక్స్’. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖులు ఈ ఛాట్ షోకు గెస్టులుగా వస్తున్నారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందరితో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ ‘కిసిక్ టాక్స్’కు ఒక టాలీవుడ్ నటి కమ్ యాంకర్ విచ్చేసింది. ఆమె కూడా తన వృత్తి, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి తాను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ను షేర్ చేసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇదే టాక్ షోలో తన పర్సనల్ అలవాట్లను కూడా షేర్ చేసుకుందీ అందాల తార. ముఖ్యంగా తన డ్రింకింగ్ హ్యాబిట్స్ గురించి ఓపెన్ గా మాట్లాడింది. ‘పార్టీలో ఏమైనా తాగుతారా?’ అని యాంకర్ వర్ష సరదాగా అడిగితే .. ‘అప్పుడప్పుడు వైన్ తీసుకుంటాను. మైండ్ ఫ్రెష్‌గా అనిపించేందుకు మాత్రమే తాగుతాను. ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్తే ఒకటి లేదా రెండు పెగ్స్ రెడ్ వైన్ వేయాల్సిందే. ఈ విషయంలో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనేం పతివ్రతను కాదు.. తాగను అని ఫేక్‌గా చెప్పడం ఎందుకు? ఏం చేస్తానో అదే ఓపెన్‌గా చెప్పేస్తాను’ అని డేరింగ్ గా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇంతకీ తన డ్రింకింగ్ హ్యాబిట్స్ గురించి ధైర్యంగా మాట్లాడిందెవరని అనుకుంటున్నారా? తను మరెవరో కాదు జబర్దస్త్ యాంకర్ సౌమ్యా రావు.
తాజాగా వర్ష ‘కిస్సిక్ టాక్స్’ షో కు హాజరైన సౌమ్యా రావు తన అలవాట్ల గురించి నిజాయతీగా మాట్లాడింది. ‘ నేను జస్ట్ మైండ్ ఫ్రెష్ అయ్యేందుకు మాత్రమే వైన్ తీసుకుంటాను. కానీ డ్రింకింగ్ అనేది అలవాటుగా మారకూడదు. జస్ట్ ఫ్రెష్ ఫీలింగ్ కోసం ఒక లిమిట్‌లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చిందీ జబర్దస్త్ అందాల తార. ఇదే షోలో సౌమ్యారావుకు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.. ‘డ్రింక్ చేసిన తర్వాత మైండ్‌లో ఏం తిరుగుతుంది’ అన్న ప్రశ్నకు సౌమ్య షాకింగ్ సమాధానమిచ్చింది.
జబర్దస్త్ సౌమ్యా రావు లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
‘నేను డ్రింక్ తీసుకున్నప్పుడు నాకు ఠక్కుమని గుర్తుకు వచ్చేది సినిమా ఇండస్ట్రీనే. ఆ డైరెక్టర్ అలా ట్రీట్ చేశాడు.. ఆ ఆర్టిస్ట్ అలా ఇలా బిహేవ్ చేశాడు? నిర్మాతలు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదన్న విషయాలే మైండ్‌లోకి వస్తాయి. దీంతో చాలా మంది నన్ను హేళనగా చూశారు. అందుకే నేను పార్టీలకు వెళ్లడం తగ్గించేశాను’ అని చెప్పుకొచ్చింది సౌమ్యా రావు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ మాజీ యాంకర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







