ఏం సినిమారా అయ్యా..! శుక్రవారం రిలీజ్.. శనివారం ఓటీటీలోకి.. కారణం ఏంటంటే..
ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా థ్రిల్లర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే.

ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఓ వైపు థియేటర్స్ లో వరుసగా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. మంచి విజయాలను అందుకుంటుంటే.. ఓటీటీలోనూ సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెలరోజులకు ఓటీటీల్లో సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని సినిమాలు నెలరోజులకంటే ముందే విడుదలై షాక్ ఇస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే వెంటనే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఓ సినిమా ఒకే ఒక్క రోజులో ఓటీటీలోకి వచ్చి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఈ ఇంట్రెస్టింగ్ సినిమా సీన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఆ సినిమా ఏదంటే..
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ్, మలయాళ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి . అలా తమిళ్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘డీఎన్‌ఏ’ అనే సినిమా ఒకటి. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. అక్కడ ఈ సినిమా జూన్ 20న విడుదలైంది . ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇదే సినిమాను తెలుగులో మై బేబీ అనే పేరుతో డబ్ చేశారు.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
ఈ సినిమాను శుక్రవారం, జూలై 18న తెలుగులో థియేటర్స్ లో విడుదల చేశారు. ఆతర్వాత రోజే ఓటీటీలోకి వచ్చేసింది. దాంతో నిర్మాతలు కూడా షాక్ అయ్యారు. ‘డీఎన్‌ఏ’ అధర్వ మురళి హీరోగా నటించాడు. అలాగే ఈ సినిమాలో నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన నిజజీవిత ఘటనతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఆసక్తికర కథతో తెరకెక్కిన ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో శనివారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీని మిస్ అవ్వకండి.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








