Salman Khan Radhe : సల్మాన్ ఖాన్ సీటీమార్ తో స్టైలిష్ స్టార్ సాంగ్ కు పెరిగిన క్రేజ్..
సినిమా ఇండస్ట్రీ లో పథ పాటలను రీమిక్స్ చేయడం షరా మాములే.. ఇప్పుడు ఒక భాషలో సూపర్ హిట్ అయినా పాటలు ఇతరభాషల్లో వాడేస్తున్నారు.
Salman Khan Radhe : సినిమా ఇండస్ట్రీ లో పాత పాటలను రీమిక్స్ చేయడం షరా మాములే.. ఇప్పుడు ఒక భాషలో సూపర్ హిట్ అయినా పాటలు ఇతరభాషల్లో వాడేస్తున్నారు. అయితే కొత్త పాటలు వచ్చిన తర్వాత పాత పాటలు కూడా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. కొత్త దానికన్నా ఎక్కువ పాత పాటనే చూడటానికి ఇష్టపడుతుంటారు కొందరు. కొన్నిసార్లు అంతే… నయా వెర్షన్ వచ్చినప్పుడు.. కొత్తదానికన్నా పాతదానికే క్రేజ్ ఎక్కువ అవుతుంటుంది. ఇదిగో ఇప్పుడు లేటెస్ట్ గా సీటీమార్ సాంగ్ విషయంలో అదే జరిగింది. సల్మాన్, దిశా కలిసి రాధే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం స్టెప్పులేసిన సీటీమార్ సాంగ్ రివీల్ అయింది. ఈ పాట మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని పాట. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా .. ఈ పాట మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాధే సినిమాలో డీఎస్‌పీ బీట్స్ పీక్స్ లో ఉన్నా, సల్మాన్ మాత్రం కెమెరా ముందు స్టెప్పుల్లో ఈజ్ చూపించలేకపోవడంతో బన్నీతో పోల్చి చూడటం మొదలుపెట్టారు డ్యాన్స్ లవర్స్
సల్మాన్ బెల్ట్ స్టెప్పు, మాస్క్ స్టెప్పు చాలు ఫ్యాన్స్ ని ఫిదా చేయడానికి అనేది కొందరి మాట. అయితే సల్మాన్ స్టెప్పులు చూశాక బన్నీ పాటను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోందని అంటున్నారు చాలా మంది సౌత్ కమ్ నార్త్ ఆడియన్స్. అయితే పుష్పతో ప్యాన్ ఇండియా రేంజ్ టచ్ చేయాలనుకుంటున్న బన్నీకి సీటీమార్ సాంగ్ మరోసారి సింప్లీ సూపర్బ్ కాంప్లిమెంట్స్ ని తెచ్చిపెడుతోందన్నమాట.
మరిన్ని ఇక్కడ చదవండి :