బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయిన ‘బర్ఫీ’ బ్యూటీ..! తన పన్నేండేళ్ల వయసు నుంచే అనుభవిస్తోందట..!
Ileana d Cruz Coments : దేవదాసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇలియానా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా తర్వాత తను
Ileana d Cruz Coments : దేవదాసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇలియానా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా తర్వాత తను వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపుగా తెలుగులోని అగ్ర హీరోలందరితో నటించిన ఈ భామ ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. అంతేకాకుండా దక్షిణాదిన ఒక తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
అనంతరం అనురాగ్ బసు చిత్రం బర్ఫీ చిత్రంతో ఇలియానా డి క్రజ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ది బిగ్ బుల్ చిత్రంలో జర్నలిస్టుగా కనిపించింది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇలియానా ఈ రోజు విజయవంతమైన నటి అయినప్పటకి తన చిన్ననాటి నుంచే తాను బాడీ షేమింగ్‌కి గురయ్యానని ఓ సినిమా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో తెలిపింది.
ఇలియానా తన 12 సంవత్సరాల వయసులో బాడీ షేమింగ్‌కు గురయ్యానని చెప్పింది. జనాలు తనను చాలా చెడ్డగా వ్యా్ఖ్యానించే వారని తెలిపింది. తన బాడీ స్ట్రక్చర్‌పై అసభ్యకరంగా కామెంట్స్ చేసేవారని వెల్లడించింది. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇలాంటి వాటిని ఎదర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కనీసం 10 సందేశాలు బాడీ షేమింగ్ గురించి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రతి గాయం తనను తాను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిందని పేర్కొంది. ఇవాళ ఈ స్తాయిలో ఉన్నానంటే ఎంతో అనుభవించి అన్నీ నేర్చుకున్నవే అని బదులిచ్చింది.