AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకలో కోవిడ్ విశ్వరూపం , ఒక్క రోజులో 31 వేలకు పైగా కరోనా కేసుల నమోదు, బెంగుళూరులోనూ తీవ్రత

కర్ణాటకలో కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజులో 31 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 180 మంది రోగులు మృతి చెందారు. ఇక బెంగుళూరు నగరంలో ఒక్కరోజులో...

కర్నాటకలో కోవిడ్ విశ్వరూపం , ఒక్క రోజులో 31 వేలకు పైగా కరోనా కేసుల నమోదు, బెంగుళూరులోనూ తీవ్రత
Rajasthan Lockdown
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 27, 2021 | 9:24 PM

Share

కర్ణాటకలో కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజులో 31 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 180 మంది రోగులు మృతి చెందారు. ఇక బెంగుళూరు నగరంలో ఒక్కరోజులో 17,550 కేసులు నమోదు కాగా 97 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు మూడు లక్షలు దాటిపోగా  ఒక్క బెంగుళూరులోనే 2.06 లక్షల కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  రాష్ట్రం లో రెండు వారాల లాక్ డౌన్ ని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకు మాత్రమే నిత్యావసర సర్వీసులను అనుమతిస్తున్నారు. ఢిల్లీలో మాదిరే కర్ణాటకలోనూ ఆక్సిజన్ఎం హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఎక్కువగా ఉంది. రోగులు, వారి బంధువుల దీనస్థితిపై సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఆక్సిజన్, మందుల కొరతను పడకల కొరతను ఆసుపత్రులు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ హాస్పిటల్స్ లో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. ఆక్సిజన్ లభ్యతపై ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం తలెత్తింది నగరంలోని స్మశాన వాటికలు  డెడ్ బాడీలతో నిండిపోతున్నాయి.   కొత్తవాటిని ఏర్పాటు  చేస్తున్నారు .  ఓ  శ్మశాన వాటికకు రోజుకు 60 నుంచి 70 మృత దేహాలు వస్తున్నాయి.

అయితే విదేశాలనుంచి అందుతున్న సాయం వల్ల పరిస్ట్గితి కొంతవరకు అదుపులోకి రాగలదని భావిస్తున్నారు.  కానీ ఈ సాయం అందడంలో జాప్యం జరుగుతోంది.  అమెరికా, బ్రిటన్, జర్మనీ  వంటి దేశాలు ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు,మందులను పంపడానికి సన్నాహాలు చేస్తున్నాయి .

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..