Delhi Corona: ఢిల్లీలో యమా డేంజర్.. గంటకు 12 మంది కరోనాతో మృతి.. కాలిపోయేందుకు 20 గంటల పాటు క్యూలైన్‌లో ఉంటున్న శవాలు
Delhi Corona: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది..
Delhi Corona: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా కరాళా నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపుఏ ఆక్సిజన్ కొరత దేశ రాజధానిలో కరోనా బాధితులకు శాపంగా మారింది. గత సోమవారం ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు ఐదుగురు చనిపోతే.. ఈ సంఖ్య ప్రస్తుతం 12కు చేరింది. ఢిల్లీలో మహమ్మారి కారణంగా గంటకు 12 మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందే ప్రత్యేకంగా చెప్పనక్కనలేదు. ఈ రోజు వరకు తీవ్ర స్థాయిలో మరణాలు సంభవిస్తు్న్నాయి. కరోనాతో చనిపోయిన వారిని స్మశాన వాటికలో కాల్చివేసేందుకు సుమారు 16 నుంచి 20 గంటల పాటు సమయం పడుతుంది. ఒక వైపు శవాలు కాలిపోతుంటే మరో వైపు శవాలు కుప్పలు తెప్పలుగా చేరుకుంటున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. ఈనెలలో ఇప్పటి 3,601 మంది మరణించారు. ఇక ఫిబ్రవరిలో మరణాల సంఖ్య 57 ఉండగా, మార్చిలో 117 ఉంది.
అంతేకాదు.. గతేడాదితో పోలిస్తే కరోనా వ్యాప్తి కూడా ఈసారి మరింత తీవ్రంగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తేల్చారు. గతేడాది కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి నలుగురికి సోకే పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి తొమ్మిది మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఢిల్లీలో ఏప్రిల్ 19న 240 కరోనా మరణాలు నమోదైతే.. ఏప్రిల్ 20న 277 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 357 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో కరోనా బాధితులను వెంటాడుతున్న ఈ తరుణంలో అక్కడి ప్రజలకు కాస్తంత ఊరట కలిగించే కబురందింది.
అమెరికా నుంచి 300 ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్స్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఢిల్లీకి చేరుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంతలా ఉందంటే.. స్వయంగా ముఖ్యమంత్రే ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నామని, సాయం చేయాలని వ్యాపారవేత్తలకు లేఖ రాసిన పరిస్థితి. ఢిల్లీలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానాల్లో చోటు చాలక పచ్చని పార్కులను, ఖాళీ ప్రదేశాలను అంతిమ సంస్కారాలకు అనువైన ప్రదేశాలుగా మారుస్తున్నారు.