Covid Care Coaches: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఐసోలేషన్​ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు..!

Covid Care Coaches: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడులేనంతగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో..

Covid Care Coaches: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఐసోలేషన్​ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు..!
Covid Care Coaches
Follow us

|

Updated on: Apr 27, 2021 | 8:07 PM

Covid Care Coaches: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడులేనంతగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో బెడ్లు సైతం సరిపోవడం లేదు. కేసులు పెరుగుతుండటంతో ఆసుత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్ననారు. ఈ నేపథ్యంలో నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే బోగీలు మళ్లీ ఐసోలేషన్‌ వార్డులగా మారుతున్నాయి. గత ఏడాది ఇదే విధంగా చేసిన కేంద్ర ప్రభుత్వం.. రోగులకు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉండటంతో రైలు బోగీలను వార్డులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉండటంతో రోగులు ఆస్పత్రి బయటే ప్రాణాలు వదులుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారత రైల్వే శాఖ రైల్వే కోచ్‌లను మరోసారి ఐసోలేషన్‌ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్​ మేరకు ఈ కోచ్​లను ఆయా ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కోవిడ్‌ పేషెంట్ల కోసంఈ బోగీలను ఎనిమిది క్యాబిన్లుగా విభజించారు. ఒక్కో కోచ్‌లో16 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో మూడు మరుగుదొడ్లు, దోమతెరలు, బయో టాయిలెట్లు, పవర్ సాకెట్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇలా అన్ని రకాల సౌకర్యాలతో రైలు బోగీలను ఏర్పాటు చేశారు. అలాగే రోగులకు ఫ్లూయిడ్ ఎక్కించేందుకు బాటిళ్లను, అదనపు బాటిల్ హోల్డర్లును, వాటిని వేలాడదీయడానికి క్లాంప్స్​ను ఏర్పాటు చేశారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం కరోనా సెకండ్​ వేవ్​తో దేశం పోరాడుతున్నందున, కోవిడ్ కేర్ ఐసోలేషన్ కోచ్​లను తిరిగి ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కోచ్​లలో రోగుల వైద్యానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాం. ఈ కోవిడ్ కేర్ కోచ్‌లు తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్ రోగులను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. వేసవి కాలం కావడంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లను ఏర్పాటు చేశాం’ అని పేర్కొంది.

64 వేల బెడ్లతో 4 వేల కోవిడ్‌ కేర్‌ కోచ్‌లు

కాగా, కరోనా మహమ్మారితో ఆస్పత్రుల్లో సైతం బెడ్ల కొరత ఉండటంతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రస్తుతం 64వేల బెడ్లతో దాదాపు 4 వేల కోవిడ్ కేర్ కోచ్‌లను దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని ఇప్పటికే కరోనా ఫస్ట్​ వేవ్​లో రోగుల అవసరాలను తీర్చగా.. మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలోని శకుర్​బస్తి స్టేషన్​లో 800 బెడ్లతో కూడిన 50 కోచ్‌లు, మహారాష్ట్రలోని నందూర్బార్​ జిల్లాలో 378 బెడ్లతో కూడిన 21 కోవిడ్​ కేర్​ కోచ్​లను ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు భోపాల్ స్టేషన్‌లో 20 బోగీలు, పంజాబ్‌లో 50 కోచ్‌లు, జబల్‌పూర్‌లో 20 కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు మరిన్ని రైల్వే కోచ్​లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.

ఇవీ కూడా చదవండి:

Oxygen: తన ప్లాంట్‌లో రూ.1కే సిలిండర్‌ నింపుతున్న మనోజ్‌ గుప్తా.. కోవిడ్‌ రోగులపై మానవత్వం చాటుతున్న వ్యాపారవేత్త

AP Corona Updates: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 11,434 పాజిటివ్‌ కేసులు..

Vistara Airline: విస్తారా ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌.. విమానంలో ఉచిత ప్రయాణం..దేశ వ్యాప్తంగా ఈ ఆఫర్‌ అందుబాటులో..!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ