AP Corona Updates: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 11,434 పాజిటివ్ కేసులు..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో74,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 11,434 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే తాజాగా 64 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,54,875 మంది కరోనా బారిన పడగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,800 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 8 మంది మృతి చెందగా, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లా ఆరుగురు చొప్పున, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణాలో ముగ్గురు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 7,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా9,47,629 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 99,446 యాక్టివ్ కేసులున్నాయి.
కాగా, ఏపీ రాష్ర్టంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. మాస్క్ ధరించని వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్క్ ధరించకుండా నిబంబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తే కేసులు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను దూరం చేసుకునేందుకు మాస్క్ ధరించకపోవడం కేసుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణంగా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.
#COVIDUpdates: 27/04/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,51,980 పాజిటివ్ కేసు లకు గాను *9,44,734 మంది డిశ్చార్జ్ కాగా *7,800 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,446#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/YIwzishY0C
— ArogyaAndhra (@ArogyaAndhra) April 27, 2021