విశాఖలో విషాదం.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి మృతి.. ఆస్పత్రిలో లక్షకుపైగా ఖర్చు.. వేరే ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఇచ్చేలోగా..

Coronavirus: కరోనా మహమ్మారి పేరు వింటేనే వెన్నులో వణుకు పెట్టేస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి చిన్నారులను సైతం వదిలి పెట్టడం లేదు. ఇక ఏపీలో..

విశాఖలో విషాదం.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి మృతి.. ఆస్పత్రిలో లక్షకుపైగా ఖర్చు.. వేరే ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఇచ్చేలోగా..
Follow us

|

Updated on: Apr 27, 2021 | 9:03 PM

Coronavirus: కరోనా మహమ్మారి పేరు వింటేనే వెన్నులో వణుకు పెట్టేస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి చిన్నారులను సైతం వదిలి పెట్టడం లేదు. ఇక ఏపీలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దారుణం విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి కరోనా బారిన పడి మృతి చెందడం మానవ హృదయాలను కలచివేస్తోంది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఓ చిన్నారికి మూడు రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అఖరి క్షణంలో చిన్నారిని కేజీహెచ్‌కు తరలించగా, అడ్మిషన్‌ ఇచ్చేలోగా అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచింది. తన బిడ్డను కాపాడాలని చిన్నారి తల్లిదండ్రుల రోదన అందరిని కలచివేసింది.

విశాఖ జిల్లా అత్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్‌ఎఫ్‌లో పని చేస్తున్నారు. ఇతనికి ఏడాదివయసు పాప జ్ఞానిత ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారికి ఈ మహమ్మారి వెంటాడింది. నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. స్థానిక వైద్యుల సూచన మేరకు సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. ఇంకా వ్యాధి నయం కాకపోవడంతోకోవిడ్‌ పరీక్షలు చేయించారు. దీంతో పరీక్షల్లో చిన్నారికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో చిన్నారిని మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో చిన్నారిని పట్టుకుని కుటుంబ సభ్యులు కింగ్‌ జార్జి ఆస్పత్రిలో చికిత్స కోసం ప్రయత్నించగా, అఖరి క్షణంలో చిన్నారి జ్ఞానిత మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇవీ చదవండి:

Delhi Corona: ఢిల్లీలో యమా డేంజర్‌.. గంటకు 12 మంది కరోనాతో మృతి.. కాలిపోయేందుకు 20 గంటల పాటు క్యూలైన్‌లో ఉంటున్న శవాలు

Covid Care Coaches: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఐసోలేషన్​ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు..!

AP Corona Updates: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 11,434 పాజిటివ్‌ కేసులు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు