AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona: తెలంగాణలో కరోనా చర్యలపై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి ఈటల రాజేందర్‌

Telangana Minister Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన..

Telangana Corona: తెలంగాణలో కరోనా చర్యలపై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి ఈటల రాజేందర్‌
Etela Rajender
Subhash Goud
|

Updated on: Apr 27, 2021 | 6:16 PM

Share

Telangana Minister Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. కరోనాకు సంబంధించిన ప్రతి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానిటరింగ్‌ చేస్తున్నారని అన్నారు. ఐఏఎస్‌ల బృందం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆక్సిజన్‌తో పాటు మ్యాన్‌పవర్‌, కిట్ల కొరత లేకుండా చూడాలని ఫార్మా కంపెనీలతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో దేశంలోనే నాలుగు లక్షల రెమిడిసివర్‌ ఇంజక్షన్లను తెప్పించిన ఘటన తెలంగాణ రాష్ట్రానిదేనని పేర్కొన్నారు.

ఆక్సిజన్‌ కొరత లేకుండా రాష్ట్రాల నుంచి విమానాల్లో తెప్పిస్తున్నాం :

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి యుద్ధ విమానాల ద్వారా తెప్పిస్తు్న్నామని ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ఆక్సిజన్‌ కొరత లేదు. 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌తో పాటు బళ్లారి నుంచి అదనంగా రాష్ట్రానికి తెప్పిస్తున్నామని అన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వో జిల్లా పరిధిలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి అన్నారు. పీఎం కేర్‌ ఫండ్‌ నుంచి ఇచ్చిన ఐదు మిషన్లను గాంధీ, టీమ్స్‌ ఆస్పత్రులతో పాటు ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్‌లలో ఏర్పాటు చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో డిమాండ్‌కు తగ్గట్లుగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రైవేట్ అసుత్రుల్లో ఇతర రాష్ట్రాల కు చెందిన పేషంట్స్ ఎక్కువ ఉన్నారని, మానిటర్లు , వెంటిలేటర్స్ సీఎం ఆదేశాల మేరకు అన్ని అసుత్రుల్లో ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.

నాచారంలోని ఈఎస్‌ఐని కోవిడ్‌ ఆస్పత్రిగా..

కాగా, నాచారంలో ఉన్న ఈఎస్‌ఐని కోవిడ్‌ ఆస్పత్రిగా 350 బెడ్లతో బుధవారం నుంచి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. ఒకే పేషెంట్‌ ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండకుండా ఆరోగ్యం మెరుగుపడితే హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నామని అన్నారు. దీని వల్ల ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉండదన్నారు. ర్యాపిడ్‌ టెస్టు కోసం రూ.500 నిర్ధారించామని, ఇది రూ.700గా తీసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చిందని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, ఇంజక్షన్‌ల కొరత ఉండదంటూ పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా మాకు ఫిర్యాదు అందిందని, వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. బాధితుల పట్ల ప్రైవేటు ఆస్పత్రులు ఉదాసినంగా వ్యవహరించాలన్నారు. 35 వేల కోట్ల బడ్జెట్‌ను పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. వ్యాక్సిన్‌ కొనుగోలు రాష్ట్రాల మీద నెట్టడం బాధాకరమన్నారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసా ప్రజలదేనని అన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టడం కేంద్రానికి భారంగా మారిందని ఆరోపించారు. కాగా, 18 ఏళ్లు పైబడిన వారికి టీకా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న కేంద్రం మాటలు అర్థరహితమని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇవీ కూడా చదవండి:

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు