భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. కరోనా కేసుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పొరుగు దేశం పాక్‌ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది..

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు
India Covid 19
Follow us

|

Updated on: Apr 24, 2021 | 7:51 PM

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. కరోనా కేసుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పొరుగు దేశం పాక్‌ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించమని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి. భారత్‌లో కరోనా పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా జోరుగా కథనాలు ప్రచురిస్తోంది. వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌, ఏబీసీ వంటి సంస్థలు భారత్‌లోని పరిస్థితులపై పలు వార్తలు ప్రచురించాయి. దేశంలోని కోవిడ్‌ 2.0పై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ ఏంటంటే..

భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని వ్యాఖ్యానించిన వాషింగ్టన్‌ పోస్టు.. జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. కరోనా ఆంక్షలు ముందస్తుగానే సడలించడంతో కరోనా విపరీతంగా పెరిగిపోయిందని, ప్రస్తుతం భారత్‌ సంక్షోభ స్థితిలో ఎంతటి దూరాన ఉన్న దేశమైనా సమీపాన ఉన్నట్టే అంటు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అవిశ్వాసం కారణంగానే కరోనాను ఎదుర్కొవడంలో భారత్‌ ప్రభుత్వం తడబడిందంటూ ది గార్డియన్‌ తన ఎడిటోరియల్‌లో వ్యాఖ్యలు చేసింది. ఇదే పత్రికలో ప్రచురితమైన మరో విశ్లేషణ.. భారత్‌లోని పరిస్థితి ప్రపంచానికి గుణపాఠం కావాలని అని కూడా వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వం తప్పటడుగులు, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా తీవ్రతరం కావడానికి కారణమని న్యూయార్క్‌ టైమ్స్‌ స్పష్టం చేసింది. ఈ కారణాల రీత్యా విజయం దిశగా వెళ్తున్న భారత్‌ కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని పేర్కొంది. భారత్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావంచ చూపే అవకాశం ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్లను నిరోధించడం, టీకాలు విస్తృతంగా అందుబాటులోకి తేవడమే ప్రస్తుతం భారత్ ముందున్న మార్గమని స్పష్టం చేసింది.

కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడ కారణంగా భారత్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఏబీసీ (ఆస్ట్రేలియా) తేల్చింది. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో లోపాలు, ప్రజల్లో అలసత్వం, కొత్త వేరియంట్లు ఉనికిలోకి రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ప్రచురించింది.

ఈ దారుణ పరిస్థితికి బాధ్యత ప్రభుత్వానిదే అని టైమ్స్‌ స్పష్టం చేసింది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. అంతేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు రాజకీయంగా పై చేయి సాధించడంపై దృష్టి పెట్టడంతో వైరస్‌ మరో దాడి చేసిందని వ్యాఖ్యానించింది. కోవిడ్‌ను అడ్డుకోవడంలో రక్షణాత్మక విధానాన్ని త్యజించడం ద్వారా భారత్ మరిపోలేని తప్పు చేసిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. భారత్‌‌ ఆస్పత్రుల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు గుండెలు పిండేసేలా ఉన్నాయని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక పేర్కొంది. ఇలా భారత్‌లో పెరుగుతున్న కరోనాపై ఇతర దేశాలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అక్కడి పత్రికలు కూడా భారత్‌లో దాపురించిన కరోనా పరిస్థితులపై కథనాలు ప్రచురించాయి. ఇతర దేశాలు భారత్‌ గురించి విశ్లేషించడంపై దేశంలో ఏ మేరకు కరోనా వ్యాప్తి చెందుతుందో అర్థమైపోతోంది.

ఈ గ్లోబల్ ఛాలెంజ్ పై అంతా కలిసి పోరాడుదాం. ఇండియాకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం

Medical Oxygen: భారత్‌కు ప్రాణవాయువు అందిస్తున్న సింగపూర్.. యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే