Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Oxygen: భారత్‌కు ప్రాణవాయువు అందిస్తున్న సింగపూర్.. యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా..!

కేంద్ర ప్రభుత్వం ప్రాణవాయువు అందించేందుకు అందుబాటులో ఉన్న వనవరులను ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్‌ సరఫరాకు విదేశాల సహకారం సైతం తీసుకుంటోంది.

Medical Oxygen: భారత్‌కు ప్రాణవాయువు అందిస్తున్న సింగపూర్.. యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా..!
Oxygen From Singapore With Iaf Aircrafts
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 24, 2021 | 3:59 PM

Oxygen with IAF Aircrafts: రాకాసి వైరస్ కరోనా మహమ్మారి దాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు.. వ్యాధికి మందులతో పాటు ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పలు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అందక రోగులు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాణవాయువు అందించేందుకు అందుబాటులో ఉన్న వనవరులను ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్‌ సరఫరాకు విదేశాల సహకారం సైతం తీసుకుంటోంది.

భారతీయు కష్టాలను చూసిన పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రాణవాయువు సరఫరాకు సింగపూర్‌తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఆక్సిజన్‌ అందించేందుకు ఆ దేశం అంగీకరించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో.. వైమానిక దళ విమానాల్లో భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఎక్కిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలోనే ఆ ట్యాంకర్లు భారత్‌కు చేరుకోనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి వీడియోను ట్వీట్టర్ వేదికగా షేర్ చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచి మూడు రోజుల్లో 10 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ప్రాణవాయువు అందక ఢిల్లీలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఢిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌లో ప్రాణవాయువు సరిపడా లేక గురువారం 25 మంది మృత్యువాతపడ్డారు.

తమ వద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు పూర్తికావస్తున్నాయని.. సాయమందించాలంటూ పలు ఆసుపత్రి వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. ఢిల్లీలోని మూల్‌చంద్‌, బాత్రా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరగా.. ప్రాణవాయువు కొరత తీర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ ఆక్సిజన్ ఫ్లాంట్లతో పాటు విదేశీయ సంస్థ ద్వారా ఆక్సిజన్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల అత్యవసవర పరిస్థితుల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరా సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read Also…  PM Modi: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… కరోనా కష్టకాలంలో పేదలకు ఊరట… ( వీడియో )