AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ చిరంజీవితో మొదటి సినిమా.. శిఖర్ ధావన్ పెళ్లిలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో సారి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు, సినీ ప్రముఖుల ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. గబ్బర్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవితో మొదటి సినిమా.. శిఖర్ ధావన్ పెళ్లిలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Shikhar Dhawan Marriage
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 4:47 PM

Share

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అతను ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలెక్కాడు. తన ప్రియురాలు సోఫీ షైన్‌ శనివారం (ఫిబ్రవరి 21) ను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా ఇప్పుడు పెళ్లి బంధంతో ఏకమయ్యారీ లవ్ బర్డ్స్. శిఖర్ ధావన్- సోఫీల వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. అలాగే సినిమా తారలు కూడా వచ్చి నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం గబ్బర్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అయితే ఈ వివాహ వేడుకలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా తళుక్కుమంది. తన అందం, క్యూట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పై ఫొటోలో రెడ్ సర్కిల్ లో ఉన్నది ఆ బ్యూటీనే. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ మూవీ ఒకటి. అంతకు ముందు వచ్చిన శంకర్ దాదా ఎం బీబీఎస్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. హిందీలో విడుదలైన లగేరహో మున్నాభాయికు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతోనే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది కరిష్మా కోటక్. చిరంజీవి పక్కన తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తర్వాత తెలుగులో తిరిగి నటించలేదు కరిష్మ. కానీ హిందీలో కొన్ని సినిమాలు చేసింది. అలాగే పంజాబీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.

శిఖర్ ధావన్ పెళ్లిలో కరిష్మా కోటక్..

కేవలం సినిమాల్లోనే కాదు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ కరిష్మా కోటక్ సందడి చేసింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గాను మెప్పించింది. ఐపీఎల్, కర్నాటక ప్రీమియర్ లీగ్, ఆసియన్ ప్రీమియర్ లీగ్, 2019 క్రికెట్ వరల్డ్ కప్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, ముంబై ప్రీమియర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, లేటెస్ట్ టీ20 వరల్డ్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లకు కరిష్మ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ తో ఆమెకు పరిచయం ఏర్పాడిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కరిష్మాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

టీ 20 వరల్డ్ కప్ లో స్పోర్ట్స్ ప్రజెంటర్ గా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us