AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Criminals: కాశ్మీర్ లో కాల్పులు జరిపారు.. మహబూబ్ నగర్ లో నక్కారు..పోలీసులకు చిక్కారు!

కాశ్మీర్ లో దాదా గిరీ చేసి ఒక ఇంటిపై కాల్పులు జరిపిన నలుగురు నిందితులు మహబూబ్ నగర్ లో తలదాచుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న వీరిని ఎట్టకేలకు దొరకబుచ్చుకుని ఆ రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.

Criminals: కాశ్మీర్ లో కాల్పులు జరిపారు.. మహబూబ్ నగర్ లో నక్కారు..పోలీసులకు చిక్కారు!
Crime News
KVD Varma
|

Updated on: Apr 27, 2021 | 9:41 PM

Share

Criminals: కాశ్మీర్ లో దాదా గిరీ చేసి ఒక ఇంటిపై కాల్పులు జరిపిన నలుగురు నిందితులు మహబూబ్ నగర్ లో తలదాచుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న వీరిని ఎట్టకేలకు దొరకబుచ్చుకుని ఆ రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒకప్పుడు చిన్న రౌడీగా కాశ్మీర్ లో తిరిగిన ఓ వ్యక్తి బాగా సంపాదించి రాజకీయాల్లోకి చేరాడు. అక్కడ ఒక ప్రధాన పార్టీకి స్థానికంగా కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇతనికి ప్రత్యర్ధిగా ఉన్న ఒక వ్యక్తి ఎదో కేసులో అక్కడి జైలులో ఉన్నాడు. చాలాసార్లు అతను బెయిలు కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

దీంతో తనకు బెయిల్ రాకుండా ప్రధాన పార్టీ నేత చేస్తున్నాడని ఈ వ్యక్తికి చెందిన వర్గం కోపం పెంచుకున్నారు. ఆ నేతను చంపెయాలనుకున్నారు. అందుకు ప్లాన్ వేశారు. పక్కా ప్రణాళికతో ఈనెల 3న ఆ నేత ఇంటిపై కాల్పులు జరిపారు. ఎవరైనా మా జోలికి వస్తే ఇలానే జరుగుతుందని హెచ్చరించారు. అదృష్టవశాత్తూ ఆ నేతకు ప్రాణాపాయం తప్పింది. దీంతో కాల్పులు జరిపిన నలుగురూ అక్కడే ఉంటె ప్రమాదం అనిపించింది. దీంతో అక్కడ నుంచి ఎటైనా వేల్లిపోవాలనుకున్నారు.

ఈ నలుగురిలోనూ ఒక వ్యక్తి బావమరిదికి మహబూబ్ నగర్ లో ఒక వ్యక్తి పరిచయం ఉన్నారు. దాంతో అతని సహాయంతో ఈ నలుగురు వచ్చి మహబూబ్ నగర్ లో ఒక లాడ్జిలో బస చేశారు. కాశ్మీర్ పోలీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. విచారణలో నిందితులు మహబూబ్ నగర్ పరిసరాల్లో ఉన్నట్టు తెలిసింది. దీంతో వాళ్ళు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అప్రమత్తం చేశారు. అయన ఎస్వోటీ పోలీసులకు ఈ నలుగురినీ పట్టుకునే పని అప్పచెప్పారు.

ఎస్వోటీ పోలీసులు కీలక ప్రాంతాల్లో మోహరించారు. నలుగురు నిందితులు ఓ కారులో ఆశ్రయమిచ్చిన వ్యక్తితో కలిసి కొత్తూరు, షాద్ నగర్ మీదుగా శంషాబాద్ వస్తున్నట్టు కనిపెట్టిన పోలీసులు తొండుపల్లి గేటు వద్ద ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులు కార్లను ఆపి తనిఖీ చేయడంతో ఆ నలుగురూ పట్టుపడ్డారు. వాళ్ళు తప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు పోలీసుల ముందు సాగలేదు. ఆ రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులకు ఈ సమాచారాన్ని చేరవేయడంతో వీళ్లను తీసుకెళ్లేందుకు ప్రత్యేక బృందం ఇటీవల నగరానికొచ్చింది. సైబరాబాద్‌ పోలీసుల పనితీరును మెచ్చుకొంది.

Also Read: మదనపల్లి జంట హత్యల కేసు : నిందితులకు బెయిల్ మంజూరు.. అదనపు జిల్లా జడ్జి సంచలన నిర్ణయం..

Murder mystery: ముగ్గురిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!