Ananthapuramu District: అనంతపురం జిల్లాలో అమానుషం.. దళిత మహిళపై దాడికి పాల్పడ్డ ఓ వర్గం..
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అమానుషంగా కొందరు దాడికి పాల్పడ్డారు ఈ ఘటన జిల్లాలోని గుంతకల్లు మండలం నక్కనదొడ్డిలో..
Ananthapuramu District:
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అమానుషంగా కొందరు దాడికి పాల్పడ్డారు ఈ ఘటన జిల్లాలోని గుంతకల్లు మండలం నక్కనదొడ్డిలో జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత మహిళపై అమానుషంగా దాడికి పాల్పడింది ఒక వర్గం. లింగమయ్య వెంకటేష్ సురేష్ శ్రీనివాస్ గ్యాంగ్ మహిళ అని కూడా చూడకుండా కింద పడవేసి కాళ్లతో తన్నుతూ .. విచక్షణారహితంగా దాడికిపాల్పడ్డారు. రోడ్డు విషయంలో జరిగిన గొడవలో ఇలా ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేసారు. ఈ గట్టణాలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై స్పందించేందుకు డి.ఎస్.పి నిరాకరించారు. ఆతర్వాత జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించడంతో డిఎస్పి షరీఫుద్దీన్ ఆ గ్రామంలో పర్యటించారు. ఇక దాడికి పాల్పడిన సంఘటన పై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాగరిక సమాజంలో కూడా ఇలా అనాగరికంగా ప్రవర్తించడం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా అని కూడా చూడకుండా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షంచాలని కోరుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :