Kannada actress Shanaya: సొంత సోదరుడినే గొంతు కోసి హతమార్చిన సినీ నటి.. పోలీసుల అదుపులో షనయ

కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీరించేలేదన్న కారణంతో తోడబుట్టిన సోదరుడినే హతమార్చిందో నటి. కన్నడ చిత్రసీమలో ఇప్పుడీ ఘటన సంచలనంగా మారింది.

Kannada actress Shanaya: సొంత సోదరుడినే గొంతు కోసి హతమార్చిన సినీ నటి.. పోలీసుల అదుపులో  షనయ
Kannada Actress Shanaya Katwe
Follow us

|

Updated on: Apr 28, 2021 | 7:02 AM

Shanaya Katwe Murders Her Brother: కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీరించేలేదన్న కారణంతో తోడబుట్టిన సోదరుడినే హతమార్చిందో నటి. కన్నడ చిత్రసీమలో ఇప్పుడీ ఘటన సంచలనంగా మారింది. సోదరుడు రాకేశ్‌ కాట్వే(32) హత్య కేసులో కన్నడ నటి షనయ కాట్వేను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షనయ, నియాజ హమీద్ కటిగర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసిన షనయ సోదరుడు వారి ప్రేమను నిరాకరించాడు. దీంతో ఎలాగైనా వారిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న సోదరుడి తప్పించాలని భావించిన షనయ.. తన ప్రియుడి సాయంతో హత్యకు కుట్ర పన్నింది. అందుకోసం మరో ముగ్గురి సాయం తీసుకుంది.

ముందుగా చేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం.. హుబ్బల్లిలోని తన ఇంట్లోనే రాకేశ్‌ గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం ఎవరి కంట పడకుండా శరీర భాగాలను అటవీ ప్రాంతంలో గుర్తు పట్టడానికి వీలు లేకుండా చేసి పడేశారు. అయితే, మృతదేహనికి సంబంధించి శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు… దేవరా గుడిహల్‌ అటవీ ప్రాంతంలో రాకేశ్‌ తల, మిగిలిన శరీరభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా.. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిలో ఇప్పటికే నియాజహమీద్ కటిగర్ (21), తౌసిఫ్ చన్నాపూర్ (21), అల్తాఫ్ ముల్లా (24), అమన్ గిరానివాలే (19)లను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా షనయను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. షనయ 2018లో కన్నడ చిత్రం ‘ఇదం ప్రేమం జీవనం’లో తొలిసారి నటించింది. ఇటీవలే ఒక అడల్ట్‌ కామెడీ చిత్రంలోనూ నటించింది.

Read Also…  Varalaxmi Sarathkumar: తెలుగు తమిళ్ భాషల్లో బిజీబిజీగా జయమ్మ.. వరలక్ష్మికి క్యూ కడుతున్న ఆఫర్లు..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?