మదనపల్లి జంట హత్యల కేసు : నిందితులకు బెయిల్ మంజూరు.. అదనపు జిల్లా జడ్జి సంచలన నిర్ణయం..
Madanapalle Murder Case : దేశంలోనే సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసు అందరికి గుర్తుండే ఉంటుంది. మూఢ నమ్మకాలతో సొంత
Madanapalle Murder Case : దేశంలోనే సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసు అందరికి గుర్తుండే ఉంటుంది. మూఢ నమ్మకాలతో సొంత కూతుళ్లనే హత్య చేశారు చదువుకున్న తల్లిదండ్రులు. ఈ కేసు విషయమై ఇవాళ మదనపల్లి 2వ అదనపు జిల్లా జడ్జి వారికి బెయిల్ మంజూరు చేశారు. మదనపల్లి తాలూకా పోలీసులు జనవరి 26 న పద్మజ, పురుషోత్తంలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అయితే ప్రస్తుతం ఆ దంపతులు మదనపల్లి స్పెషల్ సబ్ జైల్ ఉంటున్నారు. అయితే ఈ కేసు ఇవాళ హియరింగ్‌కి రాగా కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మదనపల్లె స్థానిక శివనగర్‌లో పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేట్ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అలేఖ్య(27), సాయిదివ్య(23). పెద్దకుమార్తె అలేఖ్య మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే రాజీనామా చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్స్‌కు సిద్ధమవుతుండగా.. రెండో కుమార్తె సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తోంది.
వాస్తవానికి మెహర్ బాబా, ఓషో భక్తులైన పురుషోత్తం నాయుడు, భార్య పద్మజ తమ కుమార్తెలను కూడా భక్తులుగా మార్చారు. ఈ క్రమంలోనే పురుషోత్తం నాయుడు ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాను వారం రోజులపాటు దీక్షలో ఉంటానని, తనకు ఎవరు ఫోన్ చేయొద్దంటూ కొలీగ్స్‌తో చెప్పాడు. దాదాపు పది రోజుల నుంచి ఇంట్లో పూజలు జరుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇంటికి వచ్చి వెళ్తున్నారని స్థానికులు పోలీసులతో పేర్కొన్నారు. మూఢ విశ్వాసాలలో మునిగిన దంపతులిద్దరూ ఆదివారం కూతుళ్లతో కలిసి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తల్లి పద్మజ.. భర్త ఎదుట పూజగదిలో చిన్న కుమార్తె సాయి దివ్యను శూలంతో పొడిచి, పెద్దకుమార్తె అలేఖ్యను డంబెల్‌తో నుదిటిపై మోది చంపింది. ఆ తరువాత తండ్రి పురుషోత్తం.. కళాశాలలో పనిచేస్తున్న తన మిత్రుడికి ఫోన్‌చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. దీంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.