Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder mystery: ముగ్గురిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!

తన, మన తేడా లేకుండా బంధాలను మరచి కన్న కొడుకు తల్లి తో పాటు తోడబుట్టువులను కడతేర్చాడు. అతి కిరాతకంగా తన వారిని కాటికి పంపిన ఘటన ప్రొద్దుటూరు లోని హైదర్ ఖాన్ వీధిలో కలకలం రేపింది.

Murder mystery: ముగ్గురిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!
Mystery
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 27, 2021 | 3:35 PM

Triple Murder mystery: తన, మన తేడా లేకుండా బంధాలను మరచి కన్న కొడుకు తల్లి తో పాటు తోడబుట్టువులను కడతేర్చాడు. అతి కిరాతకంగా తన వారిని కాటికి పంపిన ఘటన ప్రొద్దుటూరు లోని హైదర్ ఖాన్ వీధిలో కలకలం రేపింది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా కుటుంబంలో ఉన్న ముగ్గరిని ఓకేసారి పొట్టన పెట్టుకున్న ఓ కిరాతకుడు.. ముగ్గురిని హత్య చేసి నేనే చంపాను అంటూ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

కడపజిల్లా ప్రొద్దుటూరులోని హైదర్ ఖాన్ వీధి లో ఈ దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోది దారుణంగా ముగ్గురిని హతమార్చాడు. తల్లి గుల్జార్ బేగం (50), చెల్లి కరీమున్నీసా ( 21), తమ్ముడు మహ్మద్ రపీ (25)ని అత్యంత దారుణంగా చంపి ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు హంతకుడు కరీముల్లా. ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని హైదరఖాన్ వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటి పెద్ద కొడుకు అయిన కరిముల్లాకు తన భార్యతో, కుటుంబం మధ్య కలహాలు ఉన్నాయని బందువులు చెబుతున్నారు. ఇదే క్రమంలో తనకు తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించలేదని కొద్ది రోజులుగా కరీముల్లా ఘర్షణకు దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున అమ్మ ఇంటికి వచ్చిన కరిముల్లా నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో తలపై మోది హతమార్చాడు. తెల్లవారిన తరువాత కరిముల్లా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తను పోలీసులకు లొంగిపోయే వరకూ హత్య జరిగిన విషయం ఎవరికి తెలియదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు ఉపయోగించి వస్తువులను స్వాదీనం చేసుకుని ,మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హైదర్ ఖాన్ వీధికి చెందిన చాంద్ బాషా, గుల్జార్ బేగం కుటుంబం నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. వీరిలో నిందితుడు కరిముల్లా పెద్ద కొడుకు. నిందితుడు కరిముల్లా ప్రొద్దుటూరులో బీరువా తయారీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితమే తల్లిదండ్రులు కరిముల్లాకి వివాహం చేయడంతో నిందితుడు కుటుంబం ఇంటి నుంచి దూరంగా ఉంటున్నాడు. అయితే, నిందితుడు కరిముల్లా మొదటి నుంచి కొంచెం మానసిక పరిస్థితి బాలేదని, అప్పుడప్పుడు కొంచెం సైకో గా ప్రవరిస్తూ ఉంటాడని బంధువులు చెబుతున్నారు.

నిందితుడు కరిముల్లా కి భార్యకి ,కుటుంబ సభ్యులకు గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సైతం కరిముల్లా తీరునే తప్పుబట్టారు. కాగా, తన భార్యపై కరిముల్లా కుటుంబ సభ్యులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలియడంతో కోపంతో ముగ్గురిని హత్య చేయడానికి ప్రేరేపించి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఈ కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదివుంటే, నిందితుడు కరిముల్లా వెర్షన్ ఇంకోలా ఉంది. తన ఇంటిలోని ముగ్గురు కుటుంబ సభ్యులుని హత్య చేసిన నిందితుడు కరిముల్లా నే స్వయానా నేనే మా అమ్మ ని,చెల్లి ని,తమ్ముడిని రోకలి బడే తో చంపానని నేరం ఒప్పుకున్నాడు. తనని 5 నెలలు నుంచి కుటుంబ సభ్యులు తన పై చేతబడి చేస్తున్నారని, నన్ను మా కుటుంబ సభ్యులు చంపాలని చూస్తున్నారని, నేను బ్రతికి ఉంటే వాళ్లు నన్ను చంపేస్తారు..అందుకే నేనే వాళ్ళను చంపేసాను అని నిందితుడు కరిముల్లా టీవీ9 తో చెప్పారు.

కరిముల్లా చేతిలో ముగ్గురు హత్య కావడం తో నిందితుడు తండ్రి చాంద్ బాషా, మరో తమ్ముడు,చెల్లులు భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. అతను మొదటి నుంచి సైకో లక్షణాలు ఉన్నాయని, అందుకే ఇంటి నుంచి భార్య తో బయట ఉంటున్నాడు అని తండ్రి చాంద్ బాషా అన్నారు. అతనిని ఎన్‌కౌంటర్ చేయాలని లేదంటే ఉరిశిక్ష వేయాలని కోరారు. అతను బయటికి వస్తే మమ్మల్ని కూడా చంపేస్తాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు తండ్రి చాంద్ పాషా. కాగా, ప్రస్తుతం నిందితుడు కరిముల్లా ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడించారు. కుటుంబ కలహాలు తోనే హత్య చేసాడని డిఎస్పీ ప్రసాద రావు అన్నారు.

Read Also…  Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..