Vistara Airline: విస్తారా ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్.. విమానంలో ఉచిత ప్రయాణం..దేశ వ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో..!
Vistara Airline: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం. కానీ ఇది అందరికి వర్తించదు. కేవలం కొంత మందికి మాత్రమే ఈ అవకాశం..
Vistara Airline: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం. కానీ ఇది అందరికి వర్తించదు. కేవలం కొంత మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. కరోనా మహమ్మారి కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు, తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది.
విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగానే విమానంలో ప్రయాణించవచ్చు.
విస్తారా ఎయిర్‌లైన్స్ ఈమేరకు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి ఉత్తరం రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా వెల్లడించింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందవచ్చని తెలిపింది. అయితే సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విస్తారా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పవచ్చు. అయితే ఈ ఉచిత విమాన ప్రయాణంపై విస్తారా ఒక నిబంధన విధించింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని పేర్కొంది.
ఇవీ చదవండి:
Corona Effect: ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే