Indane Gas Booking: మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? ఈ నెంబర్ చెబితేనే గ్యాస్ డెలివరి అవుతుంది..!
Indane Gas Booking: గ్యాస్ కంపెనీలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. బ్లాక్ మార్కెట్ దందా మాత్రం ఆగడం లేదు. అనేక ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను.
Indane Gas Booking: గ్యాస్ కంపెనీలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. బ్లాక్ మార్కెట్ దందా మాత్రం ఆగడం లేదు. అనేక ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. ఆయా గ్యాస్ కంపెనీలు ఎన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి బ్లాక్‌దందాకు అడ్డుకట్ట వేస్తేన్నా.. కేటుగాళ్లు ఇతర మార్గాల్లో వెళ్తూ బ్లాక్ దందా కొనసాగిస్తున్నారు.
అయితే ఇండేన్ గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడానికి డ్యాక్ సర్వీసులను తీసుకువచ్చింది. డ్యాక్ అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ అని అర్థం. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసిన ప్రతీసారి ఒక డ్యాక్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ డ్యాక్ నంబర్ వినియోగదారుల ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది. గ్యాస్ డెలివరి చేయడానికి వచ్చిన బాయ్స్‌కు ఆ కోడ్ చెప్పాల్సి ఉంటుంది. ఆ కోడ్ నెంబర్ చెప్పిన తర్వాతే డెలివరి ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇండేన్ గ్యాస్ తన వినియోగదారులకు కీలక సూచనల చేసింది. ఇండేన్ గ్యాస్ బుక్ చేసిన ప్రతీసారి డ్యాక్ జనరేట్ అవుతుందని తెలిపింది. ఈ నెంబర్ డెలివరి బాయ్‌కు చెప్పిన తర్వాతనే మీ డెలివరి పూర్తవుతుంని ఇండేన్ గ్యాస్ స్పష్టం చేసింది.
మీకు మరింతగా సేవలు చేయడానికి తమకు సహకరించాలని వినియోగదారులను కోరింది. ఈ విషయాలను ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది ఇండియన్ ఆయిల్. అయితే ఈ కోడ్ చెప్పకపోతే గ్యాస్ డెలివరీ సాధ్యం అయ్యే అవకాశం లేదు.
Did you know that a unique DAC is generated every time you book your #Indane refill? Share the DAC with the delivery personnel to complete the delivery process. Help us serve you better. #Indane #DAC #LPG pic.twitter.com/Am9IxgbVlI
— Indian Oil Corp Ltd (@IndianOilcl) April 24, 2021