- Telugu News Photo Gallery Business photos Sbi offers video kyc based savings account opening feature on yono
SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!
SBI Account: స్టే్‌ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ ఖాతా తెరవడం ఇక మరింత సులభతరం కాబోతోంది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో ద్వారా ఇంటి నుంచే సేవింగ్ ...
Updated on: Apr 23, 2021 | 6:52 PM

SBI Account: స్టే్‌ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ ఖాతా తెరవడం ఇక మరింత సులభతరం కాబోతోంది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో ద్వారా ఇంటి నుంచే సేవింగ్ అకౌంట్ తెరువవచ్చు. ఇందు కోసం యోనో యాప్‌లో వీడియో కేవైసీ ( నో యువర్ కస్టమర్) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కరోనా కారణంగా వినియోగదారుల బ్యాంకుకు రాకుండా ఇంటి నుంచే ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించింది.

కాంటాక్ట్‌లెస్, పేపర్ లెస్ విధానంలో ఖాతా తెరిచేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. మొబైల్ బ్యాంకింగ్‌లో ఇదో కొత్త సదుపాయంగా డిజిటల్ వైపు ఆకర్షితులు కావాడనికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.

ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు కస్టమర్లు ముందుగా యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యూ టు ఎస్‌బీఐ ఆప్షన్‌ను ఎంచుకుని ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.

ఆధార్ వివరాలు నమోదు చేసి అథెంటికేషన్ పూర్తయిన తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం కేవైసీ పూర్తి చేసుకునేందుకు వీడియో కాల్‌ను అటెండ్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత ఎస్‌బీఐలో ఖాతా ఓపెన్ అవుతుంది. ఈ విధానం ద్వారా సులభంగా ఎస్‌బీఐలో ఖాతా తెరవవచ్చు





























