ATM Cash Withdrawal: రోజురోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటాము. అయితే ఏటీఎం దగ్గర లేకపోతే డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవడం కుదరదు. అలాంటి విధానానికి చెక్ పెడుతున్నాయి పలు బ్యాంకులు. ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అకౌంట్ ఉన్న బ్యాంకుకు సంబంధించిన యాప్ ఉంటే చాలు. అందులో డబ్బులు ఎంటర్ చేసి ఏటీఎంలో పిన్ ఎంటర్ చేస్తే చాలు నగదు వచ్చేస్తుంది. అంతేకాదు ఇకపై బ్యాంకింగ్ యాప్స్ కూడా అవసరం లేదు. ఒక్క ఎస్‌బీఐనే కాదు... బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీ బ్యాంకు సహా అనేక బ్యాంకులు ఈ సదుపాయాన్ని ప్రారంభించాయి