Cars for Middle Class: మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ ఐదు కార్లు వరమే.. లుక్.. మైలేజ్‌లో కూడా సూపర్బ్.. ఓ లుక్కేయండి..
Middle Class Cars: మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. ఎందుకంటే..
Updated on: Apr 22, 2021 | 5:49 PM

Middle Class Cars: మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. ఎందుకంటే.. వారికి కారు అవసరం. అలాంటి వారికి మేము ఈ రోజు 5 కార్లను తీసుకువచ్చాం. కారు కొనాలనుకుంటున్న వారు వీటిని చూసి.. ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Maruti Suzuki

హ్యుండాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్: మంచి ఫీచర్లతో నిండిన వాహనాన్ని సొంతం చేసుకోవాలంటే.. మీరు గ్రాండ్ ఐ 10 నియోస్ తీసుకోవచ్చు. దీనిలో సీఎన్జీ నుంచి పెట్రోల్, డీజిల్ ఎంపికలు సైతం ఉన్నాయి. ఈ కారు మధ్యతరగతి కుటుంబానికి సరైన కారు.

నిస్సాన్ మాగ్నైట్: మీకు కాంపాక్ట్ ఎస్‌యూవీ కావాలంటే.. నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర 6.65 లక్షల రూపాయలు. ఒకవేళ ఈ వాహనం టాప్ మోడల్‌ను కొనాలనుకుంటే.. మీరు 11.63 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

హ్యుండాయ్ వెనూ: మీరు నిస్సాన్ మాగ్నైట్ కాకుండా వేరేది సెలెక్ట్ చేయాలంటే.. హ్యుండాయ్ వెనూను తీసుకోవచ్చు. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీని ప్రారంభ ధర రూ .8.10 లక్షలు. టాప్ మోడల్ ధర 14.20 లక్షల రూపాయలు ఉంది.

టాటా టియాగో: చిన్న మధ్యతరగతి కుటుంబానికి మంచి కారు. భద్రత విషయంలో దీని ర్యాంకింగ్.. మొదటి స్థానంలో ఉంది. దీని ప్రారంభ ధర 5.85 లక్షల రూపాయలు. ఒకవేళ మీరు టాప్ మోడల్‌ను కొనాలనుకుంటే.. 8.16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.





























