Mankind Pharma: కరోనాతో పోరాడి మరణించిన వారికి మ్యాన్‌కైండ్ రూ.100 కోట్ల విరాళం.. ప్రకటించిన ఫార్మా కంపెనీ
Mankind Pharma: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ కరోనా మహ్మారితో పోరాడి.
Mankind Pharma: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ కరోనా మహ్మారితో పోరాడి మరణించిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఫార్మాసిస్టుల కుటుంబాలకు 100 కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. సంబంధిత వర్గాల వారికి మూడు నెలల్లో ఈ మొత్తం సొమ్మును అందించేందుకు ఫార్మా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మ్యాన్‌కైండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ రాజీవ్ జునేజా మాట్లాడుతూ.. కరోనా పోరాటంలో ప్రజలకు రక్షణగా నిలుస్తున్న ఎంతో మంది వైరస్ సోకి మరణించారు. వాళ్లందరికీ నివాళిగా రూ.100 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నాము. ఇది మా కార్తవ్యంగా భావించడం లేదు.వాళ్లకు రుణపడి చేస్తున్న పని అనుకుంటున్నాము అని అన్నారు.
కాగా, గత ఏడాది నుంచి కరోనా మహమ్మారితో ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. పోలీసులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, ఇతర సిబ్బంది కరోనా పోరాటంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కంపెనీలు ముందుకు వచ్చి తమవంతుగా విరాళాలు ప్రకటిస్తున్నాయి.
As PM @narendramodi @PMOIndia paves the path towards fighting this pandemic, we strengthen our promise to serve life with compassion and care. We announce Rs. 100 Crores in honour of our martyrs who lost the battle against Covid-19 as a token of gratitude. ? pic.twitter.com/woC4HmNEzD
— Mankind Pharma (@Pharma_Mankind) April 26, 2021