క‌రోనాను జ‌యించిన 104 ఏళ్ల స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు.. కరోనా వస్తే ఎలా ఉండాలో చెప్పిన వృద్ధుడు

 Freedom Fighter Corona: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక కరోనా..

క‌రోనాను జ‌యించిన 104 ఏళ్ల స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు.. కరోనా వస్తే ఎలా ఉండాలో చెప్పిన వృద్ధుడు
Follow us

|

Updated on: Apr 25, 2021 | 7:18 PM

Freedom Fighter Corona: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక కరోనా మరణాల్లో ఎక్కువ శాతం వృద్ధులో ఉంటున్నారు. అందులో దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం కూడా కరోనా మరణాలకు కారణమవుతున్నాయి. అయితే బారిన పడితే ఆత్మస్థైర్యం, ధైర్యంతో ముందుకు సాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధైర్యంతో ఉంటే కరోనాను జయించవచ్చని ఓ 104 ఏళ్ల వృద్ధుడు అంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు భ్రుదిచంద్‌ జీ గోతి (104) ఏప్రిల్‌ 5న కరోనా బారిన పడ్డారు. దీంతో తమ ఫ్యామిలీ డాక్టర్‌ సూచనల మేరకు ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకున్నాడు. రోజులో రెండు, మూడు గంటల పాటు ఆక్సిజన్‌ తీసుకున్న ఆయన.. ఎట్టకేలకు కరోనాను జయించాడు. దీనికి తోడు పాజిటివ్‌గా ఉండటం, నవ్వుతూ ఉండటం, రోజు వ్యయామం చేస్తుండటం వల్ల తాను కరోనాను నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే తనకు కరోనా సోకినప్పటికీ సరిపడ పౌష్టికాహారం తీసుకుని కరోనాను జయించాను అని వృద్ధుడు చెబుతున్నాడు. కరోనా సోకిన వారందరూ కూడా పాజిటివ్‌గా ఆలోచించాలని, నెగిటివ్‌కు దూరంగా ఉండాలని ఆ వృద్ధుడు సూచించాడు.

కాగా, మధ్యప్రదేశ్‌లో శనివారం ఒక్క రోజే 12,918 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 104 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,85,703కు చేరుకోగా, మ‌ర‌ణాల సంఖ్య 5,041కి చేరింది. ఇక దేశంలో ఆదివారం ఉద‌యం నాటికి 3,49,691 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 2,767 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి:

Coronavirus: ఏపీలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు